ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

కవిత:మధుర మనోహరం

కన్నులలో నెలవుంటే 
కనుల ముందు నీవున్నట్టే 
స్వరూపంలోని తేజస్సంతా
మెరిసే కిరణకాంతుల విద్యుతిచ్చే
చెరగని చెలిమితో
కలిమి పంచిన ప్రియసఖివే
పరిస్థితుల రొదలో
చేజారిన పున్నమి చందమామవే
మానసపు ఆకాశంలో
నిండుగా వెలిగిన స్వప్నసుందరివే
తలపుల రాగాలతో
వలపువీణపై పలికిన సుస్వరానివే
పదాలమ్మ పరవళ్ళతో
పరుగులెత్తే పదబంధాల సొబగువే
సోయగాలతో స్వప్నాలదీవిలో
చక్కంగా విహరించే సొగసువే
వివరాలెన్నెన్ని చెప్పినా
చెలి ప్రాభావలముందు దిగదుడుపే
..........
విసురజ 

No comments: