ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

కవిత : మూడుముక్కల మాట

రోజాపువ్వు ఎరుపుకు
సూర్యుని మెరుపు కారణమైతే
కాంతి రేఖలు గర్వపడేగా
మది వేదనకు
మనసు నివేదనే కారణమైతే
హృదికి విచిలితం తప్పదుగా
తలపుల తాకిడికి
సడి లేని సవ్వడికి
ఎడద విలవిల వగచుగా
కన్నుల్లో గోదావరే
సుడులు తిరుగుతు పారితే
మనసు వెతలలోపడినట్టే
ప్రేమ భావనలే
తనువంతా వెల్లువలా పాకితే
ఒడలే సంగీతవాద్యమయ్యేగా
మమతే మౌనగీతమైతే
పలుకు సంజ్ఞలే అక్షరాలు
మూగనోము నేతృత్వంలో
........
విసురజ

No comments: