ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 12 November 2014

1) కష్టాలకు వెరవని వాడు, స్పర్దంటే భయపడనివాడు, వ్యర్ధవ్యాసంగాలలో మునగనివాడు..జీవితంలో ఎదుగుతాడు, జీవితాన్ని గెలుస్తాడు..
2) ప్రసన్నమైన వదనంతో స్నేహదీపిక చేపట్టి బ్రతుకులో ముందుకు వెడితే జీవితమంతా నందనమయమే, ఆనందయోగమే.
3) కులము,గోత్రము,జాతి,మతము...మానవాళి మనుగడ వీటితో ముడిపడి లేదు..వీటికంటే ఉన్నతమైనవి...నీతి, నిర్భీతి వీటితోనే మానవాళి మనుగడ ముడిపడివుంది, బాగుపడనుంది.
............

No comments: