ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 12 November 2014

కవిత: ఎన్టీఆర్

సుమశరుడే సురలోకం వీడి పుడమిని పుడితే
అతడు నవ్యందాల నందమూరి తారక రాముడే
ఇంద్రుడు చంద్రుడు సురులు 
యక్షులు సర్వులు కోరే అందం ఎవరిది
సర్వోపగతుండు తీరిగ్గా తీర్చిచెక్కిన అందం 
నిమ్మకూరు ఊరి నందమూరి నందనుడుది
పెద్దపెద్దకళ్ళతో సూటైనముక్కుతో అందాల రూపుడీ రాముడు 
నడిచొచ్చే నరనారాయణుడే ఆంధ్రుల అభిమాన నటసార్వభౌముడు
కత్తివీరుడైనా,సాంఘీకనాయకుడైనా,కధానాయుకుడైనా,శ్రీనాధుడైనా 
నటనలో జీవించడం నందమూరికే చెల్లు 
కృష్ణుడైనా,రాముడైనా,రావణుడైనా,భీష్ముడైనా,రారాజైనా,
పాత్రలో పరకాయప్రవేశం నటరత్నకే చెల్లు
హావభావాలలో దివ్యనటనావిన్యాసంలో ఆతనికి సరిజోడు లేడు
నవరసాలోలికించుటలో అగ్రగ్రణ్యుడు అతనే సినీలోకానికి ఆరాధ్యుడు 

No comments: