ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 16 November 2014

1) కొంతమంది మనుష్యులు నిన్ను పదే పదే చేతలతోనో లేక మాటలతోనో బాధిస్తున్నా సాధిస్తున్నా వారినీ వాటిని ఒపికతో భరించు పైగా క్రింద చెప్పిన దానిపై నమ్మకముంచు
"సాండ్ పేపర్ తో పదే పదే రుద్దితే చివరికి మెరిసేది వస్తువే, అరిగి చిరేగేది సాంద్ పేపరే"..
2) స్వతహసిద్దంగా బుద్దిమమంతులై నిలవాలి అలానే మెలగాలి అంతే గానీ మన మంచితనం గురించి, మనమేమిటో ఇత్యాదివి మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చెయ్యకూడదు. సదా ఉత్తమమైన విషయమేమిటంటే ఏమీ చెప్పకనే మన గురించి అవతలి వారు తెలియడమే, తెలిసి మెచ్చడమే.
3) మన చేష్టలే మన వ్యక్తిత్వాన్ని దర్శింపచేయూ..కోపం, అసహనము, చిరాకు నీ వ్యక్తిత్వ లేమిని ఎత్తిచూపు అలాగే నింపాదితనం, పద్దతిగా మరియు ఒపికా వ్యవహరించడం విశేష వ్యక్తిత్వాన్ని ఎలుగెత్తి చాటు..

No comments: