1) అవతలి వ్యక్తి గురించి పూర్తిగా గ్రహణ వున్నప్పుడు..మిత్రుల మధ్య మాటల అవసరం వుండదు..అలాగే ఏమి తెలియనప్పుడు ఎన్ని మాటలు చెప్పినా అవతలి వ్యక్తి మనోరధం అవగతం కాదు. ప్రయత్నలు నిష్ఫలయత్నాలు మిగిలే..
2) వెదురును వేణువుగా మలచవచ్చు, బండరాతిని కూడా కావలసిన రూపుగా మార్చవచ్చు..పరుగులెత్తే ప్రవాహానికి అడ్డుకట్ట వెయ్యవచ్చు... మేధ వుంటే, కానీ ఎంత మేధ వున్న అసూయ గూడు కట్టుకున్న కొంపను కూల్చడం సులువేమీ కాదు..
3) మాటలో సౌమ్యత, నడకలో నాజూకుతనం, నడతలో వినమ్రత అలాగే వ్యవహార క్రియలతో నమ్మకం కల్పించడం కరువైతే నిలువెత్తు ధనం వున్నా నగుబాటు కాక తప్పదు..
No comments:
Post a Comment