ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

విహారయాత్రలలోనే తీరనివిషాదం అనూహ్యంగా కలిగితే 
సేదతీర్చే (బియాస్) నదీజలాలే జలసమాధి చేస్తే
ఊహలకందని ఉపద్రవమే అకస్మాత్తుగా సంభవిస్తే
కలగలసితిరిగిన మిత్రులకే కాలంచెల్లి కనుమూస్తే 
వెలగబోయే స్నేహదీపాల వెలుగులే ఆరిపోతే 
చిందేయబోయే చిన్నారులే చిదిమి వేయబడితే
తలిదండ్రుల శోకానికి తీరనిదుఃఖానికి అంతుండేనా
విధిచే వ్యధపంచబడిన మమతలకు బాధతీరేనా 


(మొన్న ఉత్తర భారత యాత్రలకు వెళ్లి బీయాస్ నదీజలాలలో కొట్టుకుపోయి మరణించిన 28 ఇంజనీరింగ్ చదివే తెలుగు పిల్లల ఆత్మశాంతికికై..ఒక చిట్టి ప్రయత్నమే ఈ కవితాశృతర్పణం)

No comments: