ఉరకలేసే ఉత్సాహానికి
గాలివాటం తెలియగునా
గాలివాటం తెలియగునా
పరుగులుతీసే చెలియలికట్టని
మట్టిమేట ఆపగలిగేనా
మట్టిమేట ఆపగలిగేనా
సరాగాల సంబరానికి
అంబరం హద్డులవ్వతగునా
అంబరం హద్డులవ్వతగునా
అనుబంధాల ప్రేమాంభుధిలో
అనురాగామృతం పలకరించకమానునా
అనురాగామృతం పలకరించకమానునా
ప్రేమవాకిళ్ళ సంసారంలో హృదివీణ అష్టపదులాలపించకమానునా
వలపురేడు సాంగత్యంలో
పలకరింపులే సన్నజాజులవ్వకమానునా
పలకరింపులే సన్నజాజులవ్వకమానునా
వలపుతలపుల సమ్మేళనంలో
మధురభాష్యాలు మమతలందిచకమానునా
మధురభాష్యాలు మమతలందిచకమానునా
ఔను ఔనుగా పైవన్నీ నిజమాటలుగా
కాదనలేని సత్యప్రభోధ నీతిమూటలుగా
కాదనలేని సత్యప్రభోధ నీతిమూటలుగా

No comments:
Post a Comment