ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

మిత్రులారా...హాయ్..
.........................
1) పరువాల ముంగిట్లో ప్రాయపు పదనిసల విన్యాసాలను కాస్త నిలువరించి, యోచించి ముందుకు అడుగులేస్తే పెద్దలకు పిన్నలకు తల దిన్చుకోవాల్సిన పని వుండదు, ఒకరితో చెప్పించుకోవాల్సిన బెడద కానరాదు..
2) చెప్పేవాడు పద్దతి మనిషైతే తప్పైన ఒప్పులా మెప్పులా వుంటుంది అలాగే చెప్పేవాడు పద్దతి కానివాడైతే మంచి కూడా చెడులా కనబడుతుంది.. పదార్ధంలో లేదు గొప్ప...వండే విధానంలో వుంటుంది అసలు గుట్టంతా..
3) పెదవులు విప్పకనే చాలా సార్లు నిశ్శబ్దం నీ మనసుని తెలుపవచ్చు కానీ చెప్పదలచినా ఒకోమారు వ్యధ/బాధ పెదవులు దాటి బయల్పడవు..

No comments: