ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 17 November 2014

కవిత: చిత్తరవులో చిన్నది ఎదుటే పడితే

చిత్తరవులోని మూర్తిని ఆర్తిగా
కనులు కలిపి చూడగా
ఎదలో మరులు రేగేలే 
తీయగా మనసు మూలిగే
పడతి వాల్జడల విసురులు
గీతల వంపుల సొబగులు
పొరలే మానసాన కవితలు
మదిలో నింపేను వలపులు
చిత్తాన్ని చిత్తుచేసిన చిత్తరువే
ఎదుటే రూపసియై నిలిచుంటే
కలల సుందరయే పలకరిస్తే
దాగని ఆనందాన్ని దాచెదేట్టా
సుహాసిని కన్నెకుమారి ఏంకాదు 
ప్రౌఢమ్మకు వయసు మీరలేదు
రూపంలో మేనకకు తీసిపోదు 
చెలియకు ప్రేమభాష అర్దంకాదు
ఎదమాటను ఎదుటున్న వనితకు
మదిగంటను మనసైన ప్రేమదేవతకు
సుమబాలా సొగసుకత్తైన హృదిరాణికి
జీవితానికి పెన్నిధివని తనకేలచెప్పను
మనసు తివాచి పరచి చూపా తెలుసుకోలే
మమత దుప్పటి కప్పి చెప్పా అర్దంకాలే
గీపెట్టి గగ్గోలుపెట్టి కేకలేసి చూసా పట్టించుకోలే
తిన్నగా తనదగ్గరకే పోయి గులాబి అందించాలే
అంతే తన హృదయ కమలాన్నిఅందించేసిందిలే
నన్ను నా మనసుని ఆనందాల ముంచేసిందిలే
జీవితాంతం తను నా చేయినిక విడువనందిలే
తనే నా జీవితమని నాకు తెలియచేప్పిందిలే 

No comments: