ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 16 November 2014

కవిత: ప్రణయలేఖ

ఓ ప్రియరాగమా హృదయగీతి పాడుమా
ఓ వయ్యారమా నయగారాలు పోకుమా
ఓ రాగదీపమా అనురాగాన్ని పంచుమా 
ఓ జీవనాదమా మమతావేసాన్ని పెంచుమా
నీవే
ప్రణయపు దారులలో కరదీపికవై నిలిచేవు
వలపుల నెలవులకై కడదాక నడిచేవు
మనసున నెత్తావులు పసందుగా చిలికేవు
తలపుల తలపులను తట్టినెట్టి తెరిచేవు
చెలియా
సన్నని నీ గొంతుకు ఏవి సరితూగవు
పక్షుల కువకువలైనా చిలకల పలుకులైనా
మిసిమి నీ సొబగుకు ఏమి సరికావు
కన్నెల పకపకలైనా జాజుల ఘుమఘుమలైనా
నేస్తమా
అల నీలిగగనాన చుప్పనాతి చంద్రుడు
నీ పసిడి మేని కాంతులను చూసి ఈర్ష్యపడేను
అక్కసుతో మేఘాలచాటుకు పోయి దాగున్నాడు
నీ మోమ మెరుపుల్ను చీకట్లలోను చూసి సిగ్గుపడేను
ప్రాణమా
తాకి నిను చిరుగాలి సిసలైన తన ఉనికిని తెలిసేను
తావి కూడ నీ స్మరణతో జగాన సుగంధమై విరిసేను
చేరి నిను గులాబి తన లాలిత్యపు గర్వాన్నివిడిచేను
దారి నిను చూసి తన వంపుల (మలుపుల) వివరాలను మరిచేను
దేవేరి
వేగారావా వేచిన విభుని వినతి ఆలకించి కరుణించ త్వరితముగా
కావగరావా చెరుకువింటివాని విరిశరముల ముప్పేటదాడినుండి ప్రేమగా నీ వాణికై నీ రాకకై నీ దర్శనపు వేళకై మది వేగిరపడేను
నీ చూపుకై నీ ప్రీతికై నీ వలపులహారతికై ఎద ఎదురుచూసేను

స్నేహమా
ప్రియతమా ఎదలోని తీయని గాయమా తీరని దాహమా
వేచేను నీకై వానరాకకై వేచే చకోరానినై తెలియుమా
ఆర్తిగా ఆత్మతృప్తిగా కడదాక తోడుగా అత్మీయమా నిలిచుండుమా
ఓపికతో మనసు బాధ తెలుసుకుని మమతలలోగిలి అందించుమా 

No comments: