ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 16 November 2014

1) కూసింత పరిణితితో కూడిన పెద్దమనసుతో వ్యవహరిస్తే వ్యక్తుల మధ్య రాగబంధాలు మధురాతి మధురంగా మార్చడం ఏమంత కష్టమేమి కాదు..
2) ఆశ్చర్యం, కలవరపాటు, భీతి, బెరుకు, వెరుపు యిత్యాది లక్షణాలు గెలుపుగుర్రం ఎక్కదలచే వారు తప్పక త్యజించాలి..అప్పుడే విజయానికి సులువైన సుమార్గం త్వరగా వేసుకోగలగుతారు..
3) ఆకులు రాలక కొత్తచివురు తొడగదు, కొత్తచిగురులు తొడగక వసంతం రాక తెలవదు..తీరిగ్గా యోచిస్తే ప్రతి క్రియకు ధీటైన సరిపాటైన ప్రక్రియ అవగతమగు..
..........

No comments: