ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

కవిత: ఎరుపు గోరింట మెరుపు

అతివ తెల్లని అరచేయికి గోరింట పూత పెట్టా
అందంగా అమరే మందార పూత
తలపులమ్మ ఆకుతో మమత పంట
మగువ అరచేత మెండుగా పండే
ఎర్రెర్రని సూరీడే గోరింటై
లలన కరకమలములలో బందీగా నిలిచుండే
పడుచు మోజులో వలపు కైపులో
ఎరుపైన వనిత కంటిరంగు చేతికంటే
ఆషాడంలో నీకై పెట్టిన గోరింట
ఇంతి మదితో ఏవేవో గుసగుసలాడే
లతిక అరచేతి మందార రంగు
పేరంటాల శ్రావణంలోను విలసిల్లే
మనసులోని మనసైన 
మదికిష్టమైన మడిసి ఊహల్లో
అమ్మణ్ణి మురిసి మైమరచే

No comments: