ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

కవిత: తండ్రికి సందేశం

అరచేది లేదు పిలిచేది లేదు
పలికేది లేదు పలకరించేది లేదు
గమ్ముగుండి కొంత దూరంగా వుంచి 
సాంతం గమనించి అవసరాలు గుర్తించి
తెలవకుండానే అసలేమి తెలపకుండానే
సర్వం ఎర్పరచి దానికై సర్వస్వం ధారపోసె
ఓ తండ్రి ఓ జనకా ఓ నాయనా
నీకు దండం వందనం పాదాభివందనం
ఏమి చదివాము అన్నది అదగలేదు
ఏమి చదవాలి అన్నది చెప్పలేదు
చదువులపైనా ఏమి చెయ్యలన్నది చూపలేదు
తీరైనా తమ జీవనమే
ఒక భవ్య సూత్రంగా బ్రతుకుకు దిక్సూచిగా 

ఒద్దికైన తమ జీవితమే 
దివ్య మంగళ మంత్రంగా లోకోత్తర మార్గదర్శిగా
చెప్పకనే చెప్పిన దొడ్డ మడిసికి 
ఓ తండ్రి ఓ జనకా ఓ నాయనా 
నీకు దండం వందనం పాదాభివందనం
నీచ కుటిల స్వార్ధ అత్మాపరాయణతత్వాలకు
నీవు దూరంగా నీకు అటువంటివి సరిపడవుగా
నేటి పద్దతులు లేని ప్రేమ పేరున
పెరుగుతున్న మహత్వకాంక్షకు దాసోహమైనవేళ
మాకు దూరమైన నీది అద్రుష్టమే
నేటి మనం మనదనే పదాలు మరచి
నాది నాదనే తత్వం బహుళంగా ఎదిగినవేళ
నీవు లేవన్న సంగతి మాకు అనందమే
అందుకే దూరమైన నీకై ఎదలోమదిలో బాధవున్నా
నానాటికి దిగజారిపోతున్న నేటిస్థితిలో
ఈ రంపపుకోతల ప్రెమలకు నీవు లేనందుకు హర్షమే
ఓ తండ్రి ఓ జనకా ఓ నాయనా
నీకు దండం వందనం పాదాభివందనం
ఈ సమాజంలో ఈ అలోచన ధోరణిలో మార్పొస్తే
అటువంటి నవ్యభవ్యదివ్య కాలమే మళ్ళొస్తే
నీవు మరలొద్దుగాని ఈ అవనిపై
మా బిడ్డవై మము కాచే దేముడివై
అంతదాక పైనుండే మము దీవించు పాలించు
మా ఇంటిగౌరావాన్ని గర్వాన్ని ఇనుమడించు 

No comments: