ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

మిత్రులారా.. శుభోదయం
.................................
1) పాఠాలు చెప్పే అధ్యాపకులు జ్ఞానమనే గది తలుపుని విద్య అనే గొళ్ళెం తీసి చూపెడతారు. ఆ గదిలోనికి నడిచేది, నడిచి ఏమన్నా నేర్చేది లేనిది మనమదే ఆధారపడి వుంటుంది.
2) చాలా మార్లు ఆపత్కర పరిస్థితుల్లో పుస్తక జ్ఞానం కన్నా అనుభవం మరియు ప్రవర్తన/ సత్ప్రవర్తన అక్కరకొచ్చే.. ఎందుకంటే జ్ఞానం అన్నివేళలా సఫలతవ్వాలని లేదు కాకపోతే సఫలత పొందే సరియైన మార్గం తప్పక చూపుతుంది.
3) కళ్ళల్లో స్వప్నాలు నింపుకోకు, కన్నీళ్ళతో జారిపోయే అవకాశం వుంది. స్వప్నాలు గుండెల్లో నింపుకుంటే, ప్రతి గుండె చప్పుడు నీకు నీ స్వప్న లక్ష్యాన్ని గుర్తుచేస్తూ వుంటుంది..

No comments: