ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

మిత్రులారా..శుభోదయం
................
1) మితంగా ఆహారం తీసుకుంటే మందులతో పని ఉండకపోగా అమితమైన హాయితో జీవనం సలపవచ్చు..లేకుంటే అమితంగా మందులు వేసుకోవలసి వస్తుంది, జీవనంలోని హాయిని కోల్పోవలసివస్తుంది.
2) తలిదండ్రులు గడియారపు అలారం గట్టిగా అరచి గీ పెట్టేది పిల్లల/మనుష్యుల బాగుకే, వారి మంచి భవితకే...వాటిని నిర్లక్ష్యం చేస్తూ జోగితే..ఆలస్యం అమృతం విషమయ్యే అవకాశం వుంది..మేలుకుంటే జరిగేది మేలే..
3) విశ్వాసం పొందే అర్హత అన్నిటికంటే విలువైన సంపద..ఈ విశ్వాసమనే సంపద కరువైననాడు ప్రేమకి/ప్రేయర్ కి అర్ధం పరమార్ధం వుండదు..
.........

No comments: