ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

మిత్రులారా..శుభోదయం
...............
1) బ్రతుకు పోరాటంలో గెలుపు ఓటమల ఆస్వాదనలో వ్యత్యాసం ఎంతో ఉండవచ్చు కానీ ప్రయత్నాల పరంగా చూస్తే వుండే తేడా అతి స్వల్పమే. ఎవరైతే ఓటమిని అంగీకరించక ముందుకు సాగిపోవునో విజయం వారినే వరించు..
2) కళ్ళు చెవులుకి పని చెప్పక వాటిని యోగంగా ఉపయోగింపక ఊరికే నోటికి పని చెప్పేవారు జీవితంలో ప్రయోజనకారి కాజాలరు..
3) మరొకరినెంచే హోదా పొందే ముందు నీవు స్వీయపరిశీలన ఆత్మవలోకన చేసుకునే సాధకుడిగా యోగ్యుడిగా రాజిల్లు..

No comments: