నువ్వేనా...నువ్వేనా
నిశి ఆవరించిన హృది ముంగిట్లో
నా ఎదకనుమలలో చీకటిని పారద్రోల
మమతవొత్తితో మనసుదీపం వెలిగించింది నువ్వేనా ...
నిశి ఆవరించిన హృది ముంగిట్లో
నా ఎదకనుమలలో చీకటిని పారద్రోల
మమతవొత్తితో మనసుదీపం వెలిగించింది నువ్వేనా ...
నువ్వేనా...నువ్వేనా
బంజరైన నా మది బేజారైన వేళ
తీపిమాటల నీటివూటను పూటపూట పోసి
బంజరుమదిని విరితోట చేసింది నువ్వేనా ..
బంజరైన నా మది బేజారైన వేళ
తీపిమాటల నీటివూటను పూటపూట పోసి
బంజరుమదిని విరితోట చేసింది నువ్వేనా ..
నువ్వేనా...నువ్వేనా
నిశీధి రాత్రులలో ఒంటరైన మనసుకు
మధురస్మృతుల స్నేహకాంతులు నింపి
ఏకాంతాన్ని దూరం చేసింది నువ్వేనా ..
నిశీధి రాత్రులలో ఒంటరైన మనసుకు
మధురస్మృతుల స్నేహకాంతులు నింపి
ఏకాంతాన్ని దూరం చేసింది నువ్వేనా ..
నువ్వేనా...నువ్వేనా
దీపం పెట్టని ఎదగదిలో
మరుల ప్రమిదలో తలపుల నూనే పోసి
అఖండ ప్రణయజ్యోతిని వెలిగించింది నువ్వేనా ...
దీపం పెట్టని ఎదగదిలో
మరుల ప్రమిదలో తలపుల నూనే పోసి
అఖండ ప్రణయజ్యోతిని వెలిగించింది నువ్వేనా ...
నువ్వేనా....నువ్వేనా
ఎటు చూస్తే అటు నువ్వేనా...నీవేనా
నువ్వేనా...సర్వం నువ్వేనా నా సర్వస్వం...నీవేనా
నువ్వేనా...సర్వత్రా నువ్వేనా...మహిమోత్తం నీవేనా
ఎటు చూస్తే అటు నువ్వేనా...నీవేనా
నువ్వేనా...సర్వం నువ్వేనా నా సర్వస్వం...నీవేనా
నువ్వేనా...సర్వత్రా నువ్వేనా...మహిమోత్తం నీవేనా
నేనంటూ అస్సలు మిగిలేనా లేక అది నువ్వేనా
నువ్వేనా నువ్వేనా మొత్తంగా నేనే నువ్వయ్యానా..
........
నువ్వేనా నువ్వేనా మొత్తంగా నేనే నువ్వయ్యానా..
........

No comments:
Post a Comment