ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 18 December 2014

1) సంద్రంలో దిగుతూ అలలూ కెరటాలూ పెద్దగా పడి లేవకూడదు, నన్ను తడపకూడదు అనుకుంటే అవివేకమే అట్లాగే జీవితంలో కష్టాలు నష్టాలు కలగకూడదు అనుకోవడం కూడా అంతే..
2) చలి వాతావరణంలో ఎండతో కూడిన వెచ్చదనానికై ఎదురుచూస్తాం...అట్లాగే బ్రతుకు శీతలంలో/మలి వయసులో ఆత్మీయత కూడిన ఆదరణకై ఎదురుచూస్తాం..
3) రంగవల్లుల లోగిళ్ళతో, కొత్త బట్టలతో, పిండి వంటలతో జరుపుకుంటేనే పండుగ కాదు...నిజమైన పండుగంటే మనసైన మనష్యుల మంచితనపు పందిర్ల క్రిందనే సంబరంగా జరుగు... 

No comments: