ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 18 December 2014

1) శ్వేత సౌధంలో వున్న పూరి గుడిసె లో వున్న...మనష్యుల రంగురూపులేమైనా ఆకలి, నిద్ర, అలసట అందరికీ ఒకటే.. అవి తీర్చుకునే తీరులు వేరు కావచ్చు...కాబట్టి ఒకర్ని ఎక్కువా మరోకర్ని తక్కువా ఎప్పుడూ చూడరాదు
2) మనసు గుడి తలుపులు తెరవక మదార్చనలు వీలవ్వునా.. కాదే అట్లే మతి తలుపులు తీయక జ్ఞానార్చున సాధ్యం కాదు
3) సమ వుజ్జీలతో సిగపట్లు తప్పక శోభించు, బలహీనులపై దాష్టీకాలు జుగప్స కలిగించు, ఇది గుర్తెరుగని మనుజులు దానవుల వంశజులగా తెలియబడుడురు..

No comments: