ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 16 December 2014

1) పచ్చపచ్చని పంట ఎదిగేముందు అక్కడ పైరుతో పాటు కలుపు కూడా తొంగిచూస్తుంది.. కలుపుని తీసుకుని పైరును కలుపుని(అంటకట్టి) సాగితే మున్ముందు మంచి పంట వచ్చు.. అలాగే మన మనసుల్లో మలినమనే కలుపుని తీసుకుని ముందుకు సాగితే స్వచ్చమైన ఆత్మజ్యోతిని దర్శించవచ్చు..
2) చూసే మనసు నిర్మలంగా ఆనందంగా వుంటే నిన్న కనబడని అందాలు నేడు ప్రస్ఫుటంగా కనబడు..లేకుంటే సౌందర్యం గట్రా అన్నీ వున్నా లేనట్టే....
3) అర్ధం చేసుకునే మనసు లేనపుడు అర్ధించినా లేక అర్ధం ఇచ్చిన లేక అర్ఘ్యం ఇచ్చినా లాభం అస్సలు వుండదు.. 

No comments: