ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 16 December 2014

1) గడువు తెలుసుకుని పనిచెయ్యడం మంచిదే కానీ అస్తస్తమాను గడువు చూసుకుంటూ పనిచేస్తే తప్పక తప్పిదాలు చేస్తారూ...
2) ఎన్నుకున్న లక్ష్యం వైపు దూసుకుపోవడం చాలా మంచిపని కానీ ఆ ప్రయత్నంలో వెర్రి మొర్రి దాసోహమనడాలు, దండాలు, దుందుడుకు చేష్టలు ఒప్పతగినవి కావు....
3) చినుకు పడి నదిగా మారి కడలికే చివరకి చేరు... అలాగే నిత్యం వెలుగు ఆత్మజ్యోతి జీవిగా మారి జీవనదిలా సాగి చివరకి శివసాయుజ్యమనే కడలినే చేరు.. నడుమ నెరిపే కర్మలన్నీ.. తత్సంబంధపువి గానే పరిగణించాలి గానీ నేను చేసాను, నాది అన్న భావం సమంజసం కాదు..ఇది తెలిసి మసిలే జీవి బ్రతుకు ధన్యమే... 

No comments: