వినాయక నిమజ్జనం
చుట్టమై వచ్చావు భాద్రపదశుద్ధ చవితినాడు మా కొరకై..గణనాధ
పాలవెల్లి కట్టి పసుపుపూసి పూలువేసిన ఉచితాసనం నీదే..గజాననా
ఆకులతో గరికలతో నానారకాల పత్రితో పూజచేస్తిమి భక్తితో..ఏకదంతా
ఉండ్రాళ్ళు మోదకులు నారికేళాలు నైవేద్యమిస్తిమి నీకు

..విఘ్నేశ్వరా
నవరాత్రుళ్ళు పండుగగా వేడుకగ సంబరమేగ ప్రతిదినం..లంబోదరా
చవితి నుంచి నేటి చతుర్దశి వరకు పూర్తిగా నీ నామజపమే..ధూమ్రవర్ణా
నిన్ను సాగనంపే జలనిమజ్జనం వేడుకగా చేసితిరి జనం..విఘ్నరాజ
కొలిచిన వారలకు కొలవని వారికి నీవే కొండంత అండా దండా..వక్రతుండా
తెలిసీ తెలియక మావేమైన తప్పులైతే పాహిమాం పాహిమాం..గజవక్త్రా
నీ చల్లని చూపుల అనురాగం నీ ఆశీర్వాద ఫలములు మాకివ్వు..బాలచంద్రా
వినాయకా..ఈ ఏడాదంతా మాకందరికి మంచిచేసి నెమ్మది నడకల..కృష్ణపింగక్షా
వచ్చేయేడు త్వరత్వరగరా మా నెలవుకు మా కొరకై నీ భక్తులకోరకై.. గజకర్ణ

No comments:
Post a Comment