ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

1) జీవితంలో క్రింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం లేదు. జీవితంలో క్రిందపడిన ప్రతీసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం, విజ్ఞ్యత వుంది.

2) విద్య యొక్క వేర్లు చేదుగా వుంటాయి, కానీ పండ్లు మాత్రం తియ్యగా వుంటాయి. ఆదిలో విద్య మొక్కల పాదులకు చేయు సేవకై శ్రమపడాలి. ఒకసారి ఈ మొక్క ఎదిగితే జీవితతాంతం విరబూస్తూనే వుంటుంది.

3) సరస హృదయం వున్నవారు సాధారణంగా మృదువైన స్వాభావం కలిగి వుంటారు. ప్రవర్తన అనే అద్దంలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం కనబడుతుంది. తెలిసుకుని ఎదగండి, జీవితంలో.

No comments: