ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

కవిత: ఏమైతే ..ఏమవ్వే
..........
రోషావేశపు కన్నులలో
స్వాభిమాన వర్షం వెల్లువై పారులే.
ప్రేమావేశపు భావనలో
పరిచయాల రాగాలన్నీ ప్రణయగీతం పాడులే.
వయ్యారం నడువోంపులలో
తొణికిసలాడు మెరుపుల్కల కాంతులే
ఈడు జోడుల సాంగత్యంలో
అందరాని స్వర్గలోక సుధలు వుండులే
రసరాగతాళ సమ్మేళనంలో
అలౌకికానంద పదనర్తనల విందులే
ప్రణయపరిపక్వ పర్వంలో
తలపుల తలగడాలన్నీ మరులతో నిండిలే

No comments: