ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 21 February 2013

1) బంగారంలోని ప్రతి అణువు విలువైనదల్లే గడిచే కాలంలోని ప్రతి నిమిషం కూడా విలువైనదే. మనుషుల్లారా తెలిసి తెలివి మెలిగి బ్రతుకు బాటన నడవండి.

2) మనిషికి మంచి మనసుండాలే గాని నానా విధాల సంపదలు వాటంతట అవే కురుస్తుంటాయి. ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపదే "పవిత్రత".

3) మనిషికి కోపం యమధర్మరాజు లాంటిది, తృష్ణ వైతరిణి లాంటిది, విద్య కామధేనువు లాంటిది. ఇది ఎరిగి సుజనులు కండి, సద్గతులు పొందండి.

No comments: