ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday 25 February 2013

" ముగ్ధమోహనం " ( 3rd chapter )

యాసిక్ ...
నేర ప్రపంచానికి, పోలీసు రికార్డ్స్ కి యాసిడ్ యాసిక్ గా తెలుసు. ప్రతి నేరానికి "మోటివ్" ఉన్నట్టే ప్రతి నేరస్తుడికీ ఒక "నేర నేపథ్యం" వుంటుంది. యాసిక్ నేరాలతో తన జీవితాన్ని ప్రారంభించలేదు. ఢిల్లీ వీధుల్లో యాసిడ్ బాటిల్స్ అమ్మేవాడు. టాయ్ లెట్స్ క్లీన్ చేసే యాసిడ్ బాటిల్స్ ఇంటింటికి తిరిగి అమ్మేవాడు. ఓ రోజు అనుకోని సంఘటన జరిగింది. అది అతని జీవితాన్ని మార్చింది. అతనిలో వున్న నేర ప్రవృత్తికి ప్రాణం పోసింది. షాపులకు యాసిడ్ బాటిల్స్ సప్లయ్ చేసి డబ్బు వసూలు చేసుకునే ప్రయత్నంలో "షాప్ అతనికి యాసిక్ కి మాటా మాట పెరిగి, యాసిల్ యాసిడ్ బాటిల్ అతనికేసి విసిరాడు. అతని మొహం కాలింది. భయంతో అతను రెట్టింపు డబ్బు ఇచ్చాడు.
యాసిక్ కి ఈ కాన్సెప్ట్ నచ్చింది. యాసిడ్ తయారు చేసి కొద్ది పాటి లాభంతో బ్రతకడం కన్నా "ఇలా యాసిడ్ భయాన్ని సొమ్ము చేసుకోవాలని" అనుకున్నాడు. అప్పటి నుంచి యాసిడ్ అమ్మడానికి కాకుండా జనాన్నిబెదిరించడానికి తయారు చేయడం మొదలు పెట్టాడు. అతని మొదటి నేరం ఖరీదు పదివేలు.. ఓ విదేశీ టూరిస్ట్ ని యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అ తర్వాత తనకు జనం భయపడాలి అనుకున్నాడు. యాసిడ్ దాడి ప్రారంభించాడు.
యాసిడ్ బాటిల్స్ తో బెదిరించి ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారం చేసాడు. పోలీసులకు దొరికినా కేసు నిలవలేదు. అలా యాసిడ్ యాసిక్ గా మారిపోయాడు. అతడ్ని సెక్స్ మానియాక్ అంటారు.
*******************************************************
రాత్రి పది దాటింది. శ్యామల అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది. ఆ ప్రతిబింబం వెనుక చంద్రం కనిపించాడు. కొద్దిగా సిగ్గు పడింది.
శ్యామలా ...ఈ రోజు ఇంకా అందంగా కనిపిస్తున్నావ్? అన్నాడు.
"రాత్రి పూట బార్యలు భర్తలకు అందంగానే కనిపిస్తారు...అదేమిటో తెల్ల వారితే మా అందం కనిపించదు..ఎందుకంటే ...?" అని ఆగి భర్త వంక చూసింది.
అతను తన అందాన్ని కాక తన మనసును చూస్తున్నాడని అర్థమైంది.
"అంజలి ఎక్కడ?" కూతురు కనిపించకపోవడంతో అడిగాడు చంద్రం .
"మన ఏకాంతానికి భంగం కలిగించవద్దనుకుని ఎదురుగా వున్న పార్క్ లో ఆడుకుంటానని బుట్టతో గులాబీలు తీసుకుని వెళ్ళింది" చెప్పింది శ్యామల.
"ఆడుకోవడానికి బుట్టతో గులాబీలు ఎందుకో ? " స్వగతంగా అనుకున్నాడు.
ఒక్క సారి బార్య వంక పరిశీలన గా చూసాడు. ఒంటి మీద పసుపుతాడు తప్ప మరేమీ లేదు. తమ కష్టంతో కట్టుకున్న చిన్న ఇల్లు...తాము ప్రాణంగా చూసుకునే తమ బిడ్డ అంజలి.
భర్త పేదరికాన్ని ఇష్టంగా ప్రేమించే బార్య దొరకడం "తన" అదృష్టం అని అతని నమ్మకం.
ఆమెకు అభిముఖంగా నిలబడి బార్య మొహాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె కళ్ళు మూసుకుంది. అతని చేతుల్లో ఆమె అరెస్ట్ కావడానికి సిద్ధంగా వుంది. అప్పుడే తలుపు మీద ఎవరో "దబ దబ" బాదిన శబ్దం. ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. ఈ వేళలో ఎవరో...?అసలే దూరంగా వుండే ప్రాంతం. ఇద్దరూ విడిపడి వెళ్లి తలుపు తీసారు.
ఎదురుగా అపరిచితుడు...లోపలి వస్తూమే తలుపేసాడు." ఎవరు మీరు...ఏం కావాలి ?" చంద్రం కోపం ధ్వనించిన స్వరంతో అడిగాడు.
"సైలెన్స్ నాకు సౌండ్ ఎలర్జీ .." అంటూ తన చేతిలో వున్న యాసిడ్ బాటిల్ చంద్రం మొహానికి తగిలించాడు.
"ఇదేమిటో తెలుసా యాసిడ్ బాటిల్ ...సరదాగా నీ మీద స్ప్రే చేసాననుకో సీరియస్ గా చచ్చి పోతావు. నువ్వు కాసేపు కోపరేట్ చేస్తే నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను" అంటూ శ్యామల వైపు చూసాడు.
చంద్రానికి పరిస్థితి అర్ధమైంది. మూలాన వున్న రాడ్ అందుకోవడానికి వెళ్ళాడు. అప్పటికే యాసిక్ చేతిలోని యాసిడ్ బాటిల్ లోని యాసిడ్ చంద్రం శరీరాన్ని తాకింది. పెద్ద కేక అతని గొంతులో నుంచి..
షాక్ తో స్పృహ తప్పి పడిపోయింది శ్యామల.
ఒక వికృత క్రీడ అక్కడ పైశాచికత్వం సాక్షిగా కొనసాగింది. మానవ మృగం...ఉన్మాది .. కొనసాగించిన శారీరక దాడి. తన కళ్ళ ముందే బార్య ను.....
ఆమె శరీరాన్ని, మనసును, తీవ్రంగా, అనాగరికంగా గాయపరచి అక్కడితో సంతృప్తి చెందక శ్యామల మీద యాసిడ్ పోసాడు.
వాళ్ళ ఆర్తనాదాలు ఆ నిర్మానుష్యమైన ప్రాంతంలో ఎవరికీ వినిపించలేదు.
*********************************************
అంజలి బుట్టలోని గులాబీలను నేల మీద పోసి ఒక్కో గులాబీని అక్షరాలుగా మారుస్తోంది.
అమ్మా,నాన్నలకు శుభాకాంక్షలు....
గులాబీలతో పేర్చిన ప్రేమ పూర్వక అక్షరాలూ..ఆ పచ్చ గడ్డి మీద గులాబీ అక్షరాలూ.
"అమ్మకు, నాన్నకు చూపించాలి" ఆ చిన్ని మనసు తహ తహ.
వెంటనే ఇంటి వైపు పరుగెత్తింది.
తలుపు తోసుకుని వెళ్లి అక్కడి దృశ్యం చూసింది.
**************************************************
కార్తికేయ టైం చూసుకున్నాడు. పదకొండు కావస్తుంది.
అంజలి గుర్తొచ్చింది. అంజలి తల్లిదండ్రుల మ్యారేజ్ డే సంగతి గుర్తొచ్చింది. శ్యామల చంద్రంలు కారికేయకు బాగా తెలుసు. అంజలి ద్వారా పరిచయం అయ్యారు. మంచి వాళ్ళు. తను గ్రీటింగ్స్ చెబితే అంజలి కూడా సంతోషిస్తుంది.
స్వీట్ షాప్ ముందు ఆగి స్వీట్ తీసుకున్నాడు. కారు అంజలి ఇంటి వైపు కదిలింది.
********************************************************************
ఒక్క క్షణం విషాదం.....అగ్ని పర్వతమైంది. శరీరాన్ని నిప్పుల కొలిమి లో కాల్చినట్టు.....శ్యామల చంద్రం అపస్మారక స్థితిలో వున్నారు. ఒళ్ళంతా కాలి బొబ్బలు ఎక్కింది. మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని అలానే అమ్మను, నాన్నను చూస్తూ, మాటలు మర్చి, సర్వం కోల్పోయినట్టు.....కార్తికేయ అంజలి దగ్గరికి వెళ్ళాడు.
అప్పుడు ...అప్పుడు ఏడ్చింది అంజలి....వేన వేల మేఘాలు ఒకేసారి వర్షించినట్టు....అ...అ...అమ్మ....నా ...నా...నాన్న అంటూ కార్తికేయను చుట్టేసింది. కార్తికేయ అంబులెన్స్ కు ఫోన్ చేసాడు.
**************************
"సారీ కార్తికేయ గారు...వాళ్ళు బ్రతికే అవకాశం ఒక్క శాతం కూడా లేదు.యాసిడ్ తో స్నానం చేయించినట్టు వుంది. ఆమె పరిస్థితి మరీ ఘోరం. అనాగరికమైన అత్యాచారం. ఆ తర్వాత యాసిడ్ ని ( ఎడిట్ ఎడిట్ )" తన సర్వీసులో ఇలాంటి కేసు ఇదే మొదటిది.
పోలీసులు వచ్చారు. మేజిస్ట్రేట్ వచ్చాడు. మరణ వాగ్మూలం ఇచ్చారు.
శ్యామల అతికష్టం మీద నోరు విప్పింది. తన మీద జరిగిన పాశవికమైన అత్యాచారం, ఆ తర్వాత యాసిడ్ ని తన...(ఎడిట్ ) ఆమె చెబుతూ వుంటే మేజిస్ట్రేట్ కదిలిపోయాడు. ఒక క్షణం బాధతో స్థాణువు అయ్యాడు.
ఇదంతా వింటోన్న అంజలి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కన్నీళ్ళు ఇంకి కసి గడ్డ కట్టింది. శ్యామల, చంద్రం చనిపోయారు.
వాళ్ళ అంత్యక్రియలు దగ్గరుండి జరిపించాడు కార్తికేయ. ఇరువురికి అంజలి తలకొరివి పెట్టింది.
*******************************************************************
"సారీ మిస్టర్ కార్తికేయ ..ఇది ఖచ్చితం గా యాసిడ్ యాసిక్ పనే....అతను రాణా సర్కిల్ పరిసర ప్రాంతాల్లో వున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ...మా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది" డిసిపి చెప్పాడు.
"థాంక్యూ సర్...ఒక జంటను నిర్దాక్షిణ్యంగా చంపాడు. పాశవికంగా అత్యాచారం చేసాడు. వాడిని ఎవరు వదిలిపెట్టినా ఈ కార్తికేయ వదిలిపెట్టాడు" అని కార్తికేయ లేచాడు.
**************-----------------*********************
స్మశానంలా వుంది అ ఇల్లు.
తనెంత చెప్పినా అంజలి ఆ ఇల్లు వదిలి రాను...అంది. అంటే కాదు తల్లిదండ్రులు చేసే పూల వ్యాపారం తను సాగిస్తానని అంది.
అమ్మా నాన్నల ఫోటో వంక చూస్తూ వుంది. కార్తికేయ ఇంట్లోకి అడుగు పెట్టి అంజలిని దగరికి తీసుకున్నాడు. చేతిలో వున్న టిఫిన్ కవర్ ఇచ్చి తినమన్నాడు.
"అతన్ని ఎప్పుడు చంపుతారు అంకుల్?" ఒకే ఒక ప్రశ్న.
తన కర్తవ్యాన్ని గుర్తుచేసే ప్రశ్న. అప్పుడే ఫోన్ రింగ్ అయ్యింది.
"సర్ నేను ఇన్ ఫార్మార్ సత్యాన్ని. మీరు చెప్పినట్టే యాసిక్ ని ట్రేస్ చేసాను...ఇరానీ కేఫ్ లో వున్నాడు" అవతలి వైపు నుంచి వినిపించింది.
అంజలి నెత్తి మీద చేయి వేసి "నీ కోరిక త్వరలోనే నెరవేరుస్తాను" అన్నాడు.
*****************************************
ఇరానీ కేఫ్ లో నుంచి బయటకు వచ్చాడు యాసిక్. తనను పోలీసులు కార్నర్ చేస్తారని గెస్ చేసాడు యాసిక్. అతని గెస్ మరోలా నిజమైంది.
ఇరానీ కేఫ్ నుంచి బయటకు రాగానే కార్తికేయ కనిపించాడు.అతని చేతిలోని రివాల్వర్ కనిపించింది. ఎప్పుడు నిర్లక్ష్యంగా "డోంట్ కేర్"లా వుండే యాసిక్ కార్తికేయను చూడగానే ఒక్క క్షణం భయపడ్డాడు.
పారిపోయే ప్రయత్నం చేసాడు. నేరస్తులను హంట్ చేయడంలో "వేటగాడు" అయిన కార్తికేయ నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని అర్ధమైంది, ఎడమ వైపు చూసాడు. వెంటనే మెరుపు వేగంగా కదిలి ఆక్కడున్న అమ్మాయిని ఒడిసి పట్టుకున్నాడు. మరో చేతిలో యాసిడ్ బాటిల్.
ఆ అమ్మాయి గింజుకుంటుంది. తను తొందరపడితే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోస్తాడు.
ఆ అమ్మాయి కార్తికేయ వైపు చూసింది బేలగా...
ఆ అమ్మాయి ము...గ్ధ...
(కార్తికేయ ఏం చేసాడు..?రేపటి సంచికలో )

Photo: విసురజ అక్షర విశ్వరూపం 
మేన్ రోబో లో తొలి డైలీ సీరియల్ 

No comments: