ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday 25 February 2013

"ముగ్ధమోహనం" (6th chapter)
..................
అమెరికా...ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ..
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వున్న ఆ కార్యాలయంలోని పదహారవ అంతస్థులో అత్యవసర సమావేశం జరుగుతోంది.
కాకలు తీరిన ఏజెంట్స్ వున్నారు. అందులో సద్దామ్ హుసేన్ ని వేటాడిన రాబర్ట్ ఒకడు.
బ్యూరో చీఫ్ అసహనంగా వున్నాడు. పది నిమిషాల క్రితమే ప్రెసిడెంట్ కార్యాలయం నుంచి అందిన మెసేజ్.
ఫెడరిక్ ను చంపేసారన్న వార్త ఎంత సీక్రెట్ గా ఉంచినా మీడియాకు లీక్ అయింది. ప్రపంచంలోనే అతి శక్తివంతమైన గూడచార సంస్థ ఏజెంట్ ని చంపేసారంటే ...ప్రజల్లో తమపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఉగ్రవాద సంస్థలు విర్రవీగుతాయి. ఇలాంటివి అమెరికానే కాదు, ఏ దేశము భరించలేదు.
బ్యూరో చీఫ్ ఎదురుగా వున్న ఏజెంట్స్ వైపు చూసాడు.
రాబర్ట్ కొద్దిగా ముందుకు వచ్చి చెప్పాడు.
"సర్..ఫెడరిక్ నిర్లక్ష్యమే అతని ప్రాణాలు తీసింది ...శత్రువును తక్కువ అంచనా వేసాడు"
"వాడ్డూయూ మీన్?
"యస్సార్ ..ఫెడరిక్ శత్రువును ట్రాప్ చేయాలని అనుకున్నాడు....కానీ తనే శత్రువు ట్రాప్ లో ఇరుకున్నాడు అంటూ ఒక్క క్షణం ఆగి తన చేతిలో వున్న "ఫైల్" ని చీఫ్ చేతికి ఇచ్చాడు.
"మోహన...ఏజ్ ట్వంటీ సిక్స్...హైట్ ఫైవ్ పాయింట్ త్రీ...వెయిట్ ఫిఫ్టీ త్రీ...కలర్ వైట్...తండ్రి అమెరికన్ ..తల్లి ఇండియన్....తల్లిని తండ్రి మోసం చేసాడని ఏడేళ్ళ వయసులోనే అమెరికన్ తండ్రిని, విస్కీలో పాము విషం కలిపి చంపేసింది.
తల్లి ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైన నీగ్రోలను అంటే ఇండియాలోని గోవాలో బీచ్ దగ్గర తల్లిపై అత్యాచారం చేసిన ఆ ముగ్గురు నీగ్రోలను రివాల్వర్ తో కాల్చి చంపింది. ఆ రివాల్వర్ కూడా ఆ నీగ్రోలదే...
మెంటల్ గా డిస్ట్రబ్ అయింది. కొన్నాళ్ళు మాదకద్రవ్యాలకు బానిసైంది. అప్పుడే మాదక ద్రవ్యాలను గోవాకు వచ్చే వారికి అమ్మడం...వాళ్ళను మత్తుకు బానిసలను చేయడం మొదలుపెట్టింది.
అప్పుడే జరిగిన గ్యాంగ్ వార్ లో మోహన తప్ప అంతా చనిపోయారు. మోహన అక్కడి నుంచి పారిపోయింది. పాకిస్తాన్ బార్డర్ లో ఓ ఉగ్రవాద సంస్థ చేతుల్లో చిక్కింది. అక్కడ హ్యూమన్ బాంబుగా మారింది. అక్కడే గన్ షూటింగ్...రాకెట్ లాంచింగ్ లో శిక్షణ పొందింది. కొందరు ఉగ్రవాదులు తనను లైంగికంగా వేధించడంతో...వీళ్ళ సమాచారాన్ని సరిహద్దు సైనికులకు చేరవేసింది. దాంతో ఆ ఉగ్రవాద సంస్థ సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. మోహన ఆ తర్వాత చాలా కాలం అజ్ఞాతంలో వుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి జరిగినప్పుడు ఆమె పేరు బయటకు వచ్చింది.
చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఆమెకు సెంటిమెంట్స్ లేవు. డబ్బు కోసం ఏదైనా చేస్తుంది. ఆల్ ఖైదా తో సంబంధాలు ఉన్నాయన్న సమాచారం మన దగ్గర వుంది." చెప్పడం ఆపి చీఫ్ వంక చూసాడు. మిగతా ఆఫీసర్స్ కామ్ గా వుండిపోయారు.
"వెల్...గుడ్ ఇన్ఫర్మేషన్ ...బట్...ఇప్పుడు మనకు మోహన కావాలి...డెడ్ ఆర్ ఎలైవ్ ...మనకు ఇంత వరకు ఫెడరిక్ డెడ్ బాడీ కూడా దొరకలేదు..." చీఫ్ ఆందోళనగా చెప్పాడు.
"ష్యూర్ సర్ ..." చెప్పాడు రాబర్ట్. తర్వాత మిగితా ఆఫీసర్స్ తో చర్చించాడు, చీఫ్ .
రాబర్ట్ బయటకు వచ్చాడు.అసలు ఫెడరిక్ లాంటి ఆఫీసర్ ని మోహన ఎలా చంపింది? అదే పెద్ద పజిల్ లా వుంది.
ఆ పజిల్ మూడి త్వరలోనే/కాసేపట్లో విడిపోతుంది. మోహన తన ట్రాప్ లో చిక్కుకుంటుంది, అనుకున్నాడు.
అది ఎంత ఓవర్ కాన్ఫిడేన్సో ఆ క్షణం అతనికి తెలియలేదు.
****************** *********** ****************
ఒక్క సారిగా ఆ కాన్ఫరెన్స్ హాలు లో కలకలం.
మోహన పేరు వినడమే కానీ ఆమెను చూసిన వారు కొద్ది మంది మాత్రమే.
పెన్సిల్ హీల్ వున్న బ్లాక్ షూ ...బ్లాక్ జీన్స్....గాగుల్స్ మొహంలో నిర్లక్ష్యం.
"హాయ్...మీరంతా నా కోసమే ఎదురు చూస్తున్నారు కదూ...సారీ ఫర్ డిలే ...ఒక హత్య అదీ ఎఫ్ బి ఐ ఏజెంట్ ని చంపడమంటే కొద్దిగా టైం తీసుకోవాలి కదా....అన్నట్టు మీట్ మిస్టర్ ఫెడరిక్ "అంటూ శవపేటికలో వున్న ఫెడరిక్ శవం వైపు తిరిగింది. ఒక్క క్షణం అక్కడ వున్న వాళ్ళలో చిన్న గగుర్పాటు.
నేను ఇతన్ని ఎలా చంపానో తెలుసుకోవాలని లేదా? అందరి వైపు చూసి అడిగింది మోహన.
నిజానికి ఆ క్యూరియాసిటి అక్కడ వునవాళ్ళలో వుంది.
కుడి కాలితో శవపేటికను ముందుకు నెట్టింది. శవపేటిక ఎదురుగా వున్న గోడ దగ్గరికి వెళ్లి ఆగింది.
నేకేడ్ గా వున్న ఫెడరిక్ మృతదేహం...
"ముప్పై మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన ఫెడరిక్.. బందీలుగా చిక్కిన మహిళా టెర్రరిస్టుల బట్టలు విప్పదీసి..వారితో అనాగరిక పనులు చేయించిన శాడిస్ట్ ఫెడరిక్....లైఫ్ ఎండ్ చేసుకున్నాడు...అదేలానో మీరూ చూడండి అంటూ ఫెడరిక్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి అతని తల కింద వున్న పెన్ డ్రైవ్ తీసి అక్కడున్న వారికి ఇచ్చి ఎదురుగా వున్న సోఫా లో కూచోని 'ప్లే" అంది.
ఎదురుగా స్క్రీన్ మీద దృశ్యం మొదలైంది.
సీక్రెట్ గా ఫెడరిక్ "మోహన" బెడ్ రూంలోకి ప్రవేశించాడు.
************ ************** ***************
"వెల్ కమ్ మిస్టర్ ఫెడరిక్"..ఆ గదిలోకి ప్రవేశించగానే వినిపించిన మాటలు...అతని చేతిలో రివాల్వర్ వుంది.
"అమ్మాయి బెడ్ రూం లోకి ఆయుధంతో వెళ్లాలని మీకు శిక్షణ టైంలో చెప్పారా? చిన్న నవ్వు ఆ తర్వాత మాటలు వినిపించాయి. అయినా నాతో ప్రైవేట్ గా మాట్లాడాలని ఇలా అఫీషియల్ గా గన్ తో వచ్చారేంటి ఫెడరిక్ ...ఈ మోహన అంటే అంత భయమా?"
ఫెడరిక్ సమాధానం కోసం తడుముకున్నాడు...అప్పుడు గమనించాడు....తన ఎదురుగా బాత్రూం ...తలుపులు తెరచుకున్నాయి. ట్రాన్స్ పరెన్సీ నైటీలో మోహన...అప్పుడే స్నానం చేసి వచ్చినట్టు..ఆక్కడక్కడ తడి...
ఒక్క క్షణం పెదాలు తడుపుకున్నాడు.
కొద్ది క్షణాల్లోనే అక్కడి వాతావరణం మారిపోయింది....కాదు మార్చేసింది మోహన..
******* ******************** *******************
బెడ్ మీద నేకేడ్ గా ఫెడరిక్...పక్కనే మోహన...
"నేను సినిమాల్లోనే అనుకున్నాను...ఈ వీక్నెస్ నిజంగానే ఉందన్న మాట...నన్ను పట్టు కోవాలని రెండు నెలల పదిహేను రోజులుగా ట్రై చేస్తున్నారు...ఇంతకీ నేను కావాలా? నన్ను అరెస్ట్ చేయడం కావాలా" మోహన నవ్వుతూనే అడిగింది.
"ముందు నువ్వు..మీ అందం కావాలి." అని నాలిక్కర్చుకున్నాడు.
"యస్...ముందు నేను కావాలి...మీ కోరిక తీరాక..నేను చావాలి...అదే నన్ను చంపాలి...రైట్..?ఈ సారి మోహన మొహంలో నవ్వు లేదు.
ఫెడరిక్ షాకయ్యాడు...మోహనను తక్కువ అంచనా వేసాడు. తన తప్పు దిద్దుకోవడానికి రివాల్వర్ దగ్గరికి వెళ్ళబోయాడు.
అప్పటికే ఆలస్యం అయింది. తలదిండు కింద వున్న నీడిల్ తీసింది. ఫెడరిక్ మెడలోకి దిగింది..పాయిజన్ నీడిల్...క్షణాల్లో ప్రత్యేకమైన లాబ్ లో తయారు చేసిన ఆ నీడిల్ లోని విషం ఫెడరిక్ ప్రాణాలు క్షణాల్లో తీసింది .
మనిషిని చంపాలంటే రివాల్వర్, అందులో బుల్లెట్స్ మాత్రమే వుంటే సరిపోదు. క్రిమినల్ బ్రెయిన్ షార్ప్ గా వుండాలి.
అతని డెడ్ బాడీని శవపేటిక లోకి మార్చింది.
************ ************************ ******************************
స్క్రీన్ మీద దృశ్యం ఆగిపోయింది.
"ఎలా వుంది ఫ్రెండ్స్ ...మంచి రొమాంటిక్ క్రైమ్ సినిమా చూస్తున్నట్టు ఉందా ?
అక్కడున్న వారికి నోట మాట రాలేదు.
సోఫాలో నుంచి లేచి ఆక్కడున్న వారి వైపు చూసింది....తరాత సెల్ బయటకు తీసి ఓ నంబర్ డయల్ చేసింది.
"హలో మిస్టర్ రాబర్ట్...ఎలా వున్నారు...మీరింకా ఎఫ్ బి ఐ దగ్గరే ఉన్నట్టున్నారు...ఇప్పుడే నేను మీ ఫెడరిక్ ను ఎలా చంపానో మీ వారికి స్క్రీన్ మీద సీన్ బై సీన్ చూపించాను..."
కాన్ఫరెన్స్ హాలులో పిన్ డ్రాప్ సైలెన్స్...ఓ సారి వాళ్ళ వైపు చూసి...
"ఆల్ ఖైదా మనుష్యులం అని చెప్పగానే నేను వచ్చి మీ ట్రాప్ లో పడిపోతానని అనుకున్నారా...మిస్టర్ రాబర్ట్...పదిహేను మంది ఏజెంట్స్...ఈ బిల్డింగ్ టోటల్ స్మాష్."
ఆగి హాలు వున్న ఎఫ్ బి ఐ ఏజెంట్స్ వైపు చూసి " మీ ఫ్రెండ్ ఫెడరిక్ నాకు చనిపోయాక కూడా ఉపయోగ పడుతున్నాడు.ఎలాగంటే...అతని డెడ్ బాడీ కింద పవర్ ఫుల్ బాంబు వుంది.
మోహన్ బయటకు నడిచింది.ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్ అయ్యాయి.లోపల వున్న వాళ్ళు ఎలర్ట్ అయ్యేలోగానే....మోహన్ తనచేతిలో వున్న రిమోట్ నొక్కింది.
క్షణాల్లో ఆ బిల్డింగ్ నామరూపాలు లేకుండా పోయింది.
అమెరికా వెన్నులో చలి పుట్టింది. ఇంటర్ పోల్ కదిలింది. రెడ్ కార్నర్ నోటీసు సిద్దంగా వుంది.
ముగ్ధ జీవితంలో అల్లకల్లోలాన్ని సృష్టించడానికి ఈ సంఘటన నాంది అయింది.
(అదేమిటో తెలుసుకోవాంటే ...రేపటి సంచిక చూడండి )

No comments: