ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

కవిత: ఏల..ఈ వణుకేలా
...
పదాలేల పదే పదే తడబడే
నీ పేరు వుచ్చరించే క్రమంలో
పాదాలేల సాగనంటు చతికిలబడే
నీ ఇంటి ముంగిటి ప్రాంగణంలో
కనులేల క్రిందకు వాలి సోలి పోయే
నీ దర్శన ఆనందోదయవేళలలో
హృదిలో పలికినేల డూ డూ సన్నాయి
నీ మధుర తలపు పల్లవించే ఘడియలలో
జడలోని జాజులుకు సిగ్గునిగ్గులేల
నీ ప్రణయకావ్య ప్రభందాల ప్రహశనంలో
గులాబీ వర్ణ ఆధరాలకు వణుకులేల
నీ పెదాల చుంబనాల సత్కారాల వేడుకలలో
పదాలల్లే హృదికి ప్రణయ భావావేశాలేల
నీ సమక్ష సన్నిధాన వలపుమందిరంలో
మధుమాసంలో అనురాగ సుమగీతాలేల
తీరని అప్పల్లే పెరిగే ఎడదకు ప్రేమ తపనలలో
విరితూపులు తాకిడికే సిగ్గమ్మ బుగ్గలు ఎర్రబడేనేల
పరువాల ముంగిట్లో ప్రాయల పలకరింపుల నేపధ్యంలో
ఇరుచూపులు రాపిడికే వయసుకొమ్మకు ప్రేమనిప్పులేల
ప్రాయాల సొగసమ్మల మది పులకరింతల మధురూహలలో

No comments: