ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 28 February 2013

"ముగ్ధమోహనం" (7th chapter)
అమెరికా వెన్నులో వణుకు పుట్టించిన సంఘటన...ఎఫ్.బి.ఐ కి సవాల్ విసిరిన మోహన.
రాబర్ట్ కు బుర్ర తిరిగిపోయింది.ఫెడరిక్ మరణమే పెద్ద అవమానంగా భావించిన ఎఫ్.బి.ఐ ఇప్పుడు తమ ఏజెంట్స్ ని కోల్పోయింది.
రాబర్ట్ కు ఎంత ఆలోచించినా అంతుబట్టడం లేదు. ఆరు నెలలుగా ప్లాన్ చేసి మొదలు పెట్టిన ఆపరేషన్. తమ డిపార్టుమెంటులో కూడా ఎవరికీ తెలియదు.
మోహన అమెరికా దాటకముందే అరెస్ట్ చేయాలి...కాదు..కాదు చంపేయాలి. ఇంతక్రితం మోహన చేసిన నంబర్ డయల్ చేసాడు. రింగ్ అవుతోంది. ఒకటి...రెండు...మూడు...ఫోన్ లిఫ్ట్ చేస్తుందా? చేయదా?
"యస్ మిస్టర్ రాబర్ట్...మీ ఏజెంట్స్ డెడ్ బాడీస్ కలెక్ట్ చేసుకున్నారా?" చిన్న నవ్వుతో మాట్లాడింది
"మిస్ ...మోహన ఐ క్యూ వున్న అమ్మయిలు సెక్స్ లో మంచి సుఖం ఇస్తారని ఎక్కడో చదివాను" ఆమెను రెచ్చగొడుతూ అన్నాడు.
"ఆఫ్ కోర్స్ ...ఆ సంగతి...పైకెళ్ళిన మీ ఫ్రెండ్ ఫెడరిక్ కి బాగా తెలుసు" మోహన కూల్ గా అంది.
నైఫ్ తో చర్మం కోసిన ఫీలింగ్.
"మిస్టర్ రాబర్ట్...మీకు ఐ క్యూ కన్నా, ఐ ఎఫ్ ఎక్కువగా వుంది.ఎంతైనా ఎఫ్.బి.ఐ కదా"
"ఐ ఎఫ్ ..ఎఫ్ ఫర్ ?
"ఫూలిష్ నెస్"
"యూ...కోపం పెరిగిపోతోంది"
"ఓకే మిస్టర్ రాబర్ట్..నన్ను మాటలో పెట్టి నేనెక్కడ వున్నానో ట్రేస్ చేయడం పూర్తయిందా? బై...ఇక ఈ నంబర్ పని చేయదు.
"వన్ సెకన్" అన్నాడు రాబర్ట్ . ఆ తర్వాత చెవులు రిక్కించి మరీ విన్నాడు. ట్రైన్ అనౌన్స్ మెంట్...'
సెలాఫ్ చేసింది మోహన. సిమ్ కార్డ్ తీసి చిన్న చిన్న ముక్కలు చేసింది. కుడి చేతిలో వున్న మినీ టేప్ రికార్డర్ ఆఫ్ చేసింది. రైల్వే అనౌన్స్ మెంట్...టేప్ చేసింది మోహన..దాన్ని రాబర్ట్ తో మాట్లాడుతున్నప్పుడు ప్లే చేసింది.
మోహన ఫోన్ పెట్టేయగానే రాబర్ట్ ఎక్సయిట్ మెంట్ లో ఓ పొరపాటు చేసాడు. సెల్ లో మోహనతో మాట్లాడుతున్నప్పుడు వెనగ్గా వినిపించిన అనౌన్స్ మెంట్ విని మోహన రైల్వేస్టేషన్ లో వుందని" అన్ని రైల్వే స్టేషన్స్ రౌండ్ అప్ చేయమన్నాడు, రాబర్ట్.
అదే సమయం లో మోహన మారు పేరుతో ఇండియా వెళ్ళే ప్లయిట్ ఎక్కేసింది.
ఇప్పుడు మోహనను చూస్తే ఎవరూ గుర్తుపట్టలేరు.. ఎవరూ గుర్తుపట్టలేరు.
యాభై ఏళ్ళ గృహిణి గెటప్ లో వుంది.
ప్లయిట్ ఎక్కే ముందు యాసిక్ కు ఫోన్ చేసింది.
******** ******** **********************
ఇండియా
న్యూ ఢిల్లీ .
ఎర్లీ మార్నింగ్
ఇంకా మంచు దుప్పటి తొలగనే లేదు.
హోం మినిస్టర్ నివాస కార్యాలయం.
హోం మినిస్టర్, సి..బి.ఐ చీఫ్, ఇద్దరే వున్నారు.
కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత...సి.బి.ఐ చీఫ్ గొంతు విప్పాడు.
"చెప్పండి సార్..ఏంతో అర్జెంటయితే తప్ప మీరు ఈ టైంలో నన్ను రమ్మనరు"
"యస్...మీరు సి.బి.ఐ చీఫ్ కన్నా ముందు నాకు చిన్నప్పటి క్లాస్ మేట్, ఈ ప్రోటోకాల్ జస్ట్ ఫార్మాలిటీనే... మీతో ఓ ముఖ్యమైన పని పడింది" లేచి టీపాయ్ మీద వున్నా కాఫీ కెటిల్ తీసాడు.
సి.బి.ఐ చీఫ్ సుందర రామమూర్తి రెండు కప్పుల్లోకి కాఫీ వంపాడు.
"చెప్పండి ..సి బి ఐ చీఫ్ గా లేక మీ స్నేహితుడిగా అయిన ఏం చేయమంటారు.." అడిగాడు.
వృత్తిలో అంకితభావం కనిపించే సుందర రామమూర్తి ఎన్నో విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాడు. ప్రతీ పౌరుడు యూనిఫాం లేని పోలీస్ అని గట్టిగా నమ్మినవాడు. సి బి ఐ చీఫ్ గా ఏ రాజకీయాన్నీ దగ్గరకు రానివ్వడు.
"మూడేళ్ళ క్రితం మీరు ఇండియా నుంచి తరిమేసిన ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ...మళ్ళీ ఇండియా లో అడుగుపెట్టబోతుంది..నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఇక్కడ ఏదో విధ్వంసం జరుపబోతుంది. మీ సి బి ఐ గాని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే ఆ విషయం బయటవాళ్ళకు తెలిసిపోతుంది, తెలిసిపోయే అవకాశముంది "
"డేర్ డెవిల్ మోహన ఇండియా వస్తుందా ?
"యస్..ఎఫ్ బి ఐ ఏజెంట్స్ ని ముప్పతిప్పలు పెట్టింది. అక్కడి నుంచి ఎస్కేప్ అయింది."
"అంటే మా సి బి ఐ కాకుండా వేరే మరొకరు ఈ కేసుని డీల్ చేయాలంటారా"
"ఎగ్జాక్ట్ లీ...ఎందుకంటే సి బి ఐ, పోలీస్ డిపార్టుమెంటులో మోహనకు వున్న నెట్ వర్క్ మీకు తెలుసు. పైగా మనం కేసు టేకప్ చేసిన వెంటనే ఆ విషయం మోహనకు తెలుస్తుంది, అందుకే ఒక సమర్థుడైన వ్యక్తి కావాలి. మీరు ఎవరిని ఈ కేసు డీల్ కోసం నియమిస్తారో మీ ఇష్టం. అతనికి అన్ని పవర్స్ ఇద్దాం. మోహనను అవసరమైతే చంపేయడానికి కూడా షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇద్దాం. ఆఫ్ కోర్స్ ... మోహన కోసం ఇంటర్ పోల్ రెడీ గా వుంది".
"ఓకే సర్ ...ఈ ఆపరేషన్ ని సక్సెఫుల్ గా చేయగల గట్స్ దండిగా వున్న వ్యక్తి ఒకరున్నారు. నాకు బిడ్డ లాంటి వాడు, హీ ఈజ్ కార్తికేయ...కన్ను మూసి తెరిచేలోగా కనురెప్పను రెండుగా చీల్చగల సమర్థుడు. ప్రాణాలు అతనికి తృణప్రాయం..కస్టమ్స్ లో ఆఫీసర్...ఆఫ్ కోర్స్ అది మీకు సమ్మతమైతేనే, అదీ విత్ యువర్ పర్మిషన్" చెప్పాడు సి బి ఐ చీఫ్.
"సుందర రామమూర్తి గారు చెప్పారంటే అతను సమర్థుడే, యోగ్యుడే అయి ఉంటాడు, అనుకొని, "ప్రొసీడ్" అన్నాడు, హోం మినిస్టర్
******** **************** *********************
సాంబ్రాణి ధూపం ఆకాశాన్ని వర్షించే మంచులా ఆ ఇంటిని చుట్టేసింది.
సుప్రభాతం కోకిల స్వరంలోనుంచి..గానామృత సుస్వర శుభోదయం పలుకుతుంది.
అప్పుడే కళ్ళు తెరిచిన కార్తికేయకి, ప్రకృతిని ఎవరో తనింటికి తీసుకువచ్చారన్న భ్రమలో...విభ్రమలో...ఆశ్చర్యానందాల వాస్తవ స్వప్నంలో స్వాప్నికుడయ్యాడు.
తలారా స్నానం చేసి...నందివర్ధనం పూవులా...అప్పుడే వికసించిన గులాబిలా..ఉదయమే రెండు ఉషోదయాలను చూసినట్టు కార్తికేయకు వుంది.
"గుడ్ మార్నింగ్ ...బెడ్ కాఫీ తాగుతారా?"
వద్దు, అన్నట్టుగా అడ్డంగా తలూపి "ఇంత పొద్దున్నే ఎక్కడిది పాలప్యాకెట్ ...?
"మీ కాలనీ చివర వున్న షాప్ దగ్గరికి వెళ్లాను."
"మీకెందుకు శ్రమ .."
"ఇష్టమైన పని ఏదీ కష్టంకాదు,...అని మా నాన్న గారు చెబుతుంటారు.మీరు త్వరగా ఫ్రెషప్ అయితే వేడి వేడి పొగలు కక్కే కాఫీ రెడీగా వుంటుంది" చెప్పింది ముగ్ధ.
అలానే ముగ్ధ వంక చూస్తూ ఉండిపోయాడు.
అదే సమయంలో ప్రమాదం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది.
ఆ ప్రమాదం పేరు మోహన.

No comments: