ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 17 February 2013

కవిత: వలపు బాస
........................
కరిమబ్బులు కమ్మినా
జాబిల్లికి జాడ మాయమగునా
ఎడబాటు కలిగినా
ఎదలో అనురాగం మాయమగునా
తనువులు వేరైనా
తలపుల తహతహలు మాయమగునా
ప్రేయసి తనతోటి లేకున్నా
వలచినవారి పట్ల వలపు మాయమగునా
చెలి నీవేడున్నా నీవెవరి సొంతమైనా
ఈ ఎద రొద నీకొరకే సుమా
చెలి నీవలపు పొందినా నీవే నాకు అందని ఫలమైనా
ఈ ఎద సుధ నీకొరకే సుమా
విసురజ

No comments: