ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

పదహారేళ్ళ పరువమే నీలం పావడ ఎర్రంచు అర్ధచీర కట్టే
కుందనపు బొమ్మ పూలెట్టి ఒంటిజడను చక్కగా సింగారించే
కులుకులొలుకే సుందరే హోయలు మరచి మూరతయ్యే
తెగ కబుర్లాడు కుర్రదే మూతికి బిరడా బిగించి నేడు మౌనికయ్యే
ఎదురుండిన పిట్టలల్లే ఎగిరి మనసు చేరే మెచ్చిన వలపు కొమ్మపై
తలచిన నాడు వలచిన వాడు తోడైనవాడు చెంత లేడని దిగులుతో
ప్రాయం పలకరించిన పిల్ల మోములో సంధ్యాచీకట్లు అలుముకునే
వచ్చిన వయసు విరిసిన సొగసు వెక్కిరిస్తున్నాయని మధనపడే
విసురజ

No comments: