ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

కవిత: జర్నీ
...
ధరణికి జాబిలి కబురంపే
వెన్నెల వెలుగుల లేఖలరేఖలతో
తెల్లని పున్నమి చంద్రుని కిరణాలు
నిశిరాత్రిలో వెలుగు చూపే దివిటీలు
సమాంతరంగా సాగు రైలు పట్టాలు
వేగపు పరుగుల వయ్యారి రైలునడకలు
చుట్టూ పచ్చని చెట్టు చేమ పలకరింపులు
కాలుష్యమెరుగని హరిత గాలుల అస్వాధనలు
రైలుపట్టాల మధ్యలో అమరిన దుంగలు
వీటి తోడ్పాటుతో చకచక సాగే రైలుబండ్లు
చెదిరిన కంకరరాళ్ళ పిక్కలు
బెదిరిన కీచురాళ్ళ శబ్దాలు
ఎదురుచూపులతో బడలిన మనసు
మనసైన తోడు రానున్నాడని మురిసేను
ఈ తీపి కబురు విన్న తొందరపడే వయసు
నిండు పున్నమి వెన్నెలలో మనసార జలకాలాడేను

No comments: