ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

వేకువ పొద్దు తిమిరమ్మను ముద్దాడేలోగ
ప్రభాత కిరణాలు పుడమిని పలకరించేలోగ
ముగ్గుల వర్ణాలు వెలయు తెలుగు లోగిళ్ళలో
ముందుగా కళ్ళాపి జల్లే పడతులు ముంగిళ్ళలో
వరిపిండితో రంగురాళ్ళ పొడితో అద్దే రంగవల్లులే
ఇంటికిచ్చు సిరులు ముగ్గులు కంటికిచ్చు ఆహ్లాదాలు
ఇంతులాడు స్పర్దాటలు రంగవల్లుల రాజ్యాలకన్నది నిజం
కలశం, పద్మం, దీపం యిట్లా ముగ్గు ముగ్గుదో అందం
ధనుర్మాస వేళలలో ముక్కనుమలలో రధంతో అంతమవ్వు
ముగ్గు ముగ్గుదో అందం రోజు ముగ్గులేసే లోగిలే లక్ష్మినివాసం
విసురజ

No comments: