ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

కవిత: పక్వపు ప్రేమ
...........
నవ్వుల నా హృదిరాణి
ఎదుటే ప్రేమరూపై నిలవంగా
వాడని సొగసుల విరిబోణి
పక్వపు వలపులే మెరవంగా
పలుకు సుమధురమే
పసందైన పరువాల నెచ్చెలే పలకంగా
మరులు ముచ్చట్లాడే మదిగదిలో
తారాడే మధురూహాల సాక్ష్యంగా
తరుణి తనువు తబ్బిబవ్వే
తన్మయత్వమే మోముపై తారట్లాడంగా
ఎదను తరిమే రమణి అందం
తళుకు బెళుకులే తళతళలాడంగా
కోమలి కులుకు కైపెక్కించే
సోకు సంపదల కుందనాల బొమ్మ నడవంగా
మిల మిల మెరుపులే తలపులలో
వయ్యారి చెలి రూపం వెలగంగా
కిల కిల నవ్వులతో చెలి
పులకింతల మనసు ఊయలపై ఊరేగంగా
ఎద వీణపై శ్రుతి మీటి ఆమని
ఆనందభైరవి రాగంలో మధురమైన పాట పాడంగా
కోరకనే కూడదన్న పాదాలు నర్తించే
జతులు వేసే ఆదితాళం కొత్తగా క్రొంగత్తగా
కలల సుందరి రానే వచ్చింది
సుమవాన తెచ్చింది నవ వసంతాల పూతగా
యవ్వన సంరంభంతో సాగింది జీవితం
చిలకరిస్తూ హరిచందనాల శ్రీగంధం వళ్ళంతా

No comments: