ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

కవిత: అనురాగపు ఆన.
....
నా మదన సామ్రాజ్య రతివి నీవైతే
నీ వలపుకు ఆరని హారతి నేనౌతా
నా నగవుల నళినివి నీవైతే
నీ నగువుకు చెదరని నెలవుని నేనౌతా
నా భవితకు భారతి నీవైతే
నీ ప్రేమభాష్యపు భవ్యపధరధం నేనౌతా
నా మరుల విరులు నీవైతే
నీ ప్రేమాలోచనలకు అక్షయపాత్ర నేనౌతా
నా మధుర ఎదకు వాణివి నీవైతే
నీ హృది లబ్ డబ్ ల శబ్దతరంగాన్ని నేనౌతా
నా మమతల తొలి మలి సంధ్యవి నీవైతే
నీ పరువపు సొగసులకై ఆరాధన అశ్వంపై వచ్చేది నేనౌతా
విసురజ

No comments: