ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

" ముగ్ధమోహనం " (13th chapter )
(07-02-2013)
ఆ క్షణం మరణమృదంగం మొదలవుతుందా? యాసిక్ పెదవుల మీద వికృతానందం. ముగ్ధ బోల్డ్ మీద చేయివేయగానే క్లిక్ అన్న సౌండ్ వినిపించింది.
డోర్ ఆటోమాటిక్ లాక్ అయింది. ముగ్ధ తలుపు తెరవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది.
అప్పుడే శ్యాంసన్ వెహికల్ ఆ ప్రాంగణం లోకి వచ్చింది. వస్తూనే కిందికి దూకాడు.యాసిక్ కు సీన్ అర్ధమైంది.ముందుకు పరుగెత్తాడు.క్షణాల్లో ఎస్కేప్ అయ్యాడు.
కార్తికేయ లాక్ రిలీజ్ చేసి శ్యాంసన్ కు ఫోన్ చేసి,ముగ్ధకు ఫోన్ ఇవ్వమన్నాడు.జరిగిందేమీ చెప్పకుండా శ్యాంసన్ తన ఫ్రెండ్ అని ,తన కోసం వచ్చాడని,తను మరో గంటలో వస్తానని చెప్పాడు.
***************** *************************** *********************
"కార్తీ ఏమైనా ఎనీ ప్రాబ్లం ?అడిగాడు చీఫ్.
క్లుప్తంగా చెప్పాడు కార్తికేయ.
పోనీ ఆ ఏరియా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి చెప్పనా?
"వద్దు నాన్న గారు...చెప్పండి నాన్న ఏమిటి విషయం?
చీఫ్ ఓ ఫైల్ ఇచ్చాడు.అందులో మోహన కు సంబంధించిన డీటెయిల్స్ వున్నాయి.
"కార్తీ ...మోహన ఇక్కడికి రావడం వెనుక ఏదో వుంది.బహుశా ఇక్కడ విధ్వంసం సృష్టించడానికి వచ్చి వుంటుంది.ఈ కేసు నువ్వే డీల్ చేయాలి.నువ్వు మాత్రమే అందుకు సమర్థుడివి ."
"మోహన ఇప్పుడెక్కడ వుందో ట్రేస్ చేసారా? అడిగాడు కార్తికేయ.
"ట్రై చేసాం..ఇంకా ట్రేస్ అవ్వలేదు.కాకపొతే ఈ రోజు ఓ క్యాబ్ డ్రైవర్ హత్య జరిగింది.ఆటను ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్నాడు.అతని క్యాబ్ లో వచ్చింది ఎవరో తెలియడం లేదు.అతి శక్తివంతమైన పాయిజన్ వల్ల చనిపోయాడు.అతని క్యాబ్ లో యాభై ఏళ్ళ మహిళ ఎక్కిందని ఎయిర్ పోర్ట్ లో వున్నా ఓ క్యాబ్ డ్రైవర్ చెప్పాడు."
"ఓకే నాన్న గారు నేను చూసుకుంటాను."అంటూ లేచాడు.
చీఫ్ లేచి "కార్తీ ఓ సారి ఇంటికి రాకూడదూ...అమ్మ కూడా అడిగింది.ముగ్గురు కొడుకులు వున్నా అమ్మలో ఒంటరితనం.కొడుకులంతా విదేశాల్లో...
వెబ్ కామ్ లో చూసి ఆనంద పడవలిసిందే"...నిట్టూరుస్తూ చెప్పాడు
"తప్పకుండా అమ్మను కలుస్తాను.అమ్మను నేను అడిగానని చెప్పండి "అని బయటకు నడిచాడు.
రిసెప్షన్ లో సులోచన కనిపించింది.
"ఈ సారి వచినప్పుడు మీరు మిసెస్ సులోచన గా కనిపించాలి "నవ్వి చెప్పాడు సులోచనతో.
బదులుగా నవ్వి."వెయిట్ తో పాటు హైట్ కూడా తగ్గించే క్లినిక్స్ వుంటే బావుండేది.
"తనకన్నా పొడవు వున్న అమ్మాయిలు బార్య గా పనికి రారనే ఆలోచన.ఈగో పొతే మీ కోరిక నెరవేరుతుంది " చెప్పింది.
సులోచన ఎత్తు ఆమె పెళ్ళికి ప్రతిబంధకం గా మారింది.తమ కన్నా లావుగా వున్నా పర్లేదు కానీ అమ్మాయి ఎత్తుగా వుంటే పెళ్లి కొడుకుల్లో కాంప్లెక్స్ .
ఎప్పటికైనా తన బాధను అర్ధం చేసుకునే మగవాడు తన జీవితం లోకి ప్రవేశిస్తాడని నమ్ముతూ వచ్చిన సులోచనలో ఆ నమ్మకం సన్నగిల్లిపోతుంది.
****************** ******************** *****************************
కార్తికేయ శ్యాంసన్ కు ఫోన్ చేసాడు.తర్వాత మరో ఇద్దరికీ ఫోన్ చేసాడు.సరిగ్గా పావు గంట తర్వాత అతని కారు టెర్మినల్ దగ్గర ఆగింది.
ఓ వ్యక్తీ వచ్చి ఓ బాటిల్ అందించి వెళ్ళాడు.చేతులకు గ్లౌస్ వేసుకున్నాడు.కారు దిగి ఎడమ వైపు సందులోకి వెళ్ళాడు.
********************** ********************* ********************
ఆ ఏరియా లోకి రావడానికి మామూలు వాళ్ళు ధైర్యం చేయరు.చిన్న చిన్న గల్లీలు.అక్కడక్కడ అనుమానం గా చూసే శాల్తీలు.
వాళ్లకు ఏ మాత్రం అనుమానం వచ్చినా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు.నేరస్స్తులకు అడ్డా....మరో పక్క వ్యభిచారం జరుగుతుంది.
కరెక్ట్ గా చెప్పాలంటే అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఇక్కడ వాళ్ళతో బిజినెస్ చేస్తారు.
(దేవతలుగా పూజించే స్త్రీ శరీరాలతో,వ్యాపారం చేయిస్తూ,జన్మని ఇచ్చిన స్త్రీమూర్తిని విపణి వీధిలో చట్ట విరుద్ధంగా,
అనాగరికంగా,అమానుషంగా దాష్టీకం చేసే నేరసమాజాన్ని తీవ్రం గా శిక్షించాలనే ఆలోచనతో...
కార్తికేయ ద్వారా నేను విధించే అక్షరాల డెత్ వారెంట్ ---రచయిత )
ఆ సందులో వున్నా చివరి ఇంట్లో వున్నాడు యా...సి...క్
అమ్మాయిల పెదవుల మీద ప్లాస్టిక్ పువ్వుల నవ్వులు...శరీరం లో కష్టానికి గురి చేసే సుఖవ్యాధులు.ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి తీసుకురాబడ్డ ఆడబిడ్డలు...
"ఏయ్ చెమిలీ ఇలా రావే ..ఓ అమ్మాయిని లాగి ఆమె బుగ్గను పళ్ళతో గట్టిగా కొరికాడు
ఆ అమ్మాయి బాధ గా కేక వేసింది.ఆ బాధను అనుచుకునే ప్రయత్నం చేస్తూ రెండు చేతులు జోడించి
"మీ ఇష్టం వున్నట్టు చేసుకోండి,డబ్బులు ఇవ్వండి.నా బిడ్డను హాస్పిటల్ లో చూపించాలి "అని వేడుకుంది.
"నా దగ్గర యాసిడ్ వుంది...తీసుకో...తీసుకో అంటూ యాసిడ్ బాటిల్ తీసి ఆమె మొహమ్మీద పెట్టాడు.
భయంతో ఓ అడుగు వెనక్కి వేసింది .అక్కడ వున్నా దాదాపు నలభై మంది మహిళల దీనగాథ.పదిహేనేళ్ళ అమ్మాయిల నుంచి వున్నారు.
డబ్బు ఇవ్వకుండా ,అతి వికృతం గా తన పైశాచిక వాంఛ తీర్చుకుంటాడు.
నిస్సహాయం గా నేలమీద పడుకుంది.
"దేవుడా మాకీ కస్టాలు ఎందుకు...నువ్వే పుట్టించావు... నువ్వే ఇలాంటి శాపాలు ఎందుకిస్తున్నావ్?
మళ్ళీ జన్మంటూ వుంటే మమ్మల్ని జంతువులుగా పుట్టించు.అప్పుడు ఏ మగ కామ జంతువూ మా జోలికి రాదు ..".
కన్నీటి తో వేడుకుంది...ఈ బాధల నుంచి విముక్తి కలిగించడాని భువి మీదికి రమ్మని వేడుకుంది.
యాసిక్ యాసిడ్ బాటిల్ తో ,పైశాచిక వంచ తో ఆమె మీదికి వంగాడు.కళ్ళు మూసుకుంది.అతను సెక్స్ లో చూపించే నరకం తల్చుకుని వణికిపోతూ
దేవుడా నిన్ను పిలిస్తే, దెయ్యాన్ని పంపించావా ..అనుకుంది...
కానీ యాసిక్ వెనుక అగ్రహొదగ్ర, మహొగ్ర రూపం తో వున్నా కార్తికేయ ను గమనించలేదు.
అప్పటికే కార్తికేయ సూచన మేరకు టీవీ చానెల్స్ ఆ ఏరియా ను చుట్టుముట్టేసాయి.
కార్తికేయ చేయి వేగంగా కదిలింది.మూడు నెలలలో ఈ ఆపరేషన్ పూర్తికాబోతుంది.
ఓబి వ్యాన్లు రెడీ గా వున్నాయి.అక్కడి దృశ్యాలు లైవ్ లో రాబోతున్నాయి.
అప్పుడే ముగ్ధ టీవీ ఆన్ చేసింది.టీవీ చానెల్స్ తిప్పుతూ సడెన్ గా ఆగింది.
టీవీలో ఓ దృశ్యం..ఆ దృశ్యం లో కార్తికేయ.
(ఆ తర్వాత ?రేపటి సంచికలో )

No comments: