ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 24 March 2013

1) బ్రతుకంతా ప్రేమకు అర్ధం వెతుకుతుంటారు, జనాలు. పుస్తకాలు, జీవితాలు చదువుతుంటారు, అక్కడా ఇక్కడా వెతుకుతుంటారు. ప్రేమకు అర్ధం చూడల్సింది మరియు అర్ధం తెలియల్సింది నిఘంటువులలోను, మరోకరి జీవితాల్లోలోంచి కాదు, నీ కన్న తల్లి ముఖంలో. అన్నీ నీ సందేహాలకు జవాబు అక్కడే దొరకు.

2) ఆశయశుద్ది లేని జీవితం చుక్కాని లేని నావ లాంటిది. ఆశయాలు, ఆదర్శాలు లేని జీవితాలు..నిష్ఫలమే. బ్రతుకులో అటువంటి వారు ఎదగలేరు... మనిషికి మనోనిశ్చలత్వం అలవడితే కోరిన ఫలితాలు అందగలుగుతారు.

No comments: