ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 27 March 2013

Chapter:50

కన్ను మూసి తెరిచేలోగా ఒక మహా విషాదం...కళ్ళ ముందే జరిగిన దారుణం.పూర్ణిమ రోడ్డు మధ్యలో మోకాళ్ళ మీద కూలబడిపోయింది. 
ఇప్పుడు ఇప్పుడు తనేం చేయాలి? పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇవ్వాలా ? కార్తికేయ ఫోన్ నంబర్ లేదు...
శ్రీనివాస్ నంబర్ కూడా లేదు.సడెన్ గా ముగ్ధ తండ్రి గుర్తొచ్చాడు....వెనక్కి పరుగెత్తింది.అప్పటికే అతని శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.అలాగే ఉన్నఫళం గా డాక్టర్ దగ్గరికి పరుగెత్తింది.
                                        ***********************************
శ్రీనివాస్ చాలా డిస్ట్రబ్ గా వున్నాడు.లక్ష్మి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు.కేవలం తనను కాపాడడం కోసమే ఆమె బలైంది.తనే టార్గెట్...కానీ అమాయకురాలు బలైంది.మరో వైపు ముగ్ధ పరిస్థితి....కపర్ది కి ఫోన్ చేసాడు.సెల్ రింగ్ అవుతోంది...కానీ లిఫ్ట్ చేయడం లేదు....చిన్న అనుమానం క్రమ క్రమం గా పెరిగి పెద్దవ్వసాగింది.
రాత్రి నుంచి గంటకోసారి ఫోన్ చేస్తూనే వున్నాడు.కపర్ది మాట్లాడుతూనే వున్నాడు.ఇప్పుడేమైంది?
                                      *******************************
కళ్ళు తెరిచాడు కపర్ది.తలంతా దిమ్ముగా,బరువుగా వుంది...తానో చిన్న గుడిసెలో వున్నాడు...అది పాడుబడిన గుడిసె...చుట్టూ ఎవరూ లేరు.లీలగా రాత్రి జరిగినదంతా గుర్తొస్తోంది. ప్లాన్డ్ గా తనని కిడ్నాప్ చేసారు....ఎదురుగా గొర్రెల కాపరి....తలను రుద్దుకుంటూ సెల్ కోసం చూసాడు.జేబులోనే వుంది.
కాల్ లాగ్ చూసాడు..రాత్రి బాస్ నుంచి వచ్చిన కాల్స్ వున్నాయి.ఒక్కో కాల్ మూడు నిమిషాలు నుంచి అయిదు నిమిషాల వరకు మాట్లాడినట్టు తెలుస్తోంది.తన సెల్ నుంచి ఎవరు మాట్లాడినట్టు....
అయిదు నిమిషాల క్రితం బాస్ మిస్సిడ్ కాల్.వెంటనే కాల్ చేసాడు.
"ఏమైంది కపర్ది...ఆర్యూ ఆల్ రైట్ ?ముగ్ధ క్షేమమే కదా ?ఆదుర్దాగా  అడిగాడు.
"సారీ సర్...నేను ముగ్ధ గారి దగ్గరికి వెళ్ళలేదు..."అంటూ రాత్రి జరిగినదంతా చెప్పాడు.
శ్రీనివాస్ కు నమ్మశక్యం గా అనిపించలేదు.తన గొంతుతో తన అసిస్టెంట్ కు ,అసిస్టెంట్ గొంతుతో తనతో మాట్లాడింది ఎవరు?ఎందుకు ఇదంతా చేసినట్టు?
"కపర్దీ నువ్వు వెంటనే ముగ్ధ దగ్గరి వెళ్ళు..ఎప్పటికప్పుడు నాకు అప్ డేట్ చేస్తుండు...క్విక్..."అన్నాడు శ్రీనివాస్.
                                             ********************************
కార్తికేయ ముందు గోడకు పెద్ద స్క్రీన్ వుంది.హైదరాబాద్,ముంబై బెంగుళూర్,చెన్నై.ఢిల్లీ. లాంటి నగరాలు ఆ స్క్రీన్ మీద ఎర్ర రంగు మార్కర్ గుర్తులున్నాయి.ఏ క్షణమైనా పై నగరాల్లో విధ్వంసం జరుగవచ్చు.
గోకుల్ చాట్, పార్లమెంట్ పై దాడి ప్రయత్నం...26/11 ,నిన్నటికి నిన్న దిల్ సుఖ్  నగర్...
ఉగ్రవాదులు తమ ఆధిక్యాన్ని చూపుతూనే వున్నారు.
ఈ సారి దాడి లక్ష్యం వేరే....మోహన ను పట్టుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదు.
మొహనకు ఢిల్లీ రప్పించాలి....
కార్తికేయ ఆలోచనలు పూర్తీ కాక ముందే శ్రీనివాస్ నుంచి ఫోన్.
"సారీ కార్తికేయ గారు...వన్ బ్యాడ్ న్యూస్...ముగ్ధను పోలీసులు తీసుకువెళ్ళారు...పోలీసులంటే వాళ్ళు నిజమైన పోలీసులు కారు...అన్ని పోలీస్ స్టేషన్ లలో ఎంక్వయిరీ చేశాను...ఇది మోహన పని అని అనుమానం...ఇప్పుడే మా అసిస్టెంట్ ముగ్ధ వాళ్ళింటికి వెళ్ళాడు."అంటూ రాత్రి జరిగిన విషయం చెప్పాడు.
కార్తికేయ అలానే ఉండిపోయాడు...తన ప్రాణాన్ని...తీసుకు వెళ్లారు..తన శ్వాసను బంధించారు.కేవలం తనను ప్రేమించినందుకు ముగ్ధ ఇన్ని కష్టాలు పడుతుందా? అయాం సారీ ముగ్దా...నుదురు మీద కొట్టుకున్నాడు.
"శ్రీనివాస్ మీరో పని చేయండి...ముగ్ధ వాళ్ళ నాన్న గారి పరిస్థితి ఎలా వుందో కనుక్కోండి....అక్కడ పూర్ణిమ అని ముగ్ధ ప్రాణస్నేహితురాలు వుంటుంది.దయవ్హేసి ఆ ఫోన్ నంబర్ నాకు వెంటనే పంపించండి.వాళ్ళ ఫ్యామిలీ కే ధైర్యం చెప్పాల్సిన బాధ్యతా నీ మీద వుంది...ప్లీజ్ "
"ష్యూర్...మీరేమీ కంగారుపడకండి...నేను పూర్ణిమ ఫోన్ నంబర్ వెంటనే పంపిస్తాను..."చెప్పాడు శ్రీనివాస్.
                                   **********************************************
పూజలు లేని గుడిలా వుంది...పూజారి లేని కోవెల లా వుంది.మంచం మీద ముగ్ధ తండ్రి.దిగులు గా తమ్ముడు..ఆ ఇంటికి మరో ముగ్ధ అయింది పూర్ణిమ...
తండ్రికి ధైర్యం చెబుతుంది...తమ్ముడిని ఓదారుస్తుంది...పూర్ణిమ ని కోల్పోయిన దుఖాన్ని దిగమింగుతూ పైకి గంభీరం గా వుంటుంది.
పుట్టి బుద్దేరిగాక దేవుడి గుడిని వదిలి బయటకు వచ్చింది పూర్ణిమ.
                                         *************************
హాల్లో వున ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది.పరుగెత్తుకు వెళ్లి రిసీవర్ లిఫ్ట్ చేసింది.
"నేను కార్తికేయను..."
వేన వేళ సంవత్సరాల దిగులు ఒకే ఒక క్షణం లో తొలిగినట్టు....ఒక గాంధర్వ గానం ఓదార్పు రాగమై వినిపించినట్టు...
"నే..నేను..పూర్ణిమ ను "గొంతు వణుకుతుండగా అంది.
"తెలుసండీ ముగ్ధ మీ గురించి ఎప్పుడూ చెబుతుండేది...ఇప్పుడు ముగ్ధ నాన్న గారికి ఎలా వుంది ?కార్తికేయ మాటలకు,పలకరింపుకు గొంతు గాద్గదికమైంది.
"వాళ్ళని నేను చూసుకుంటాను...ముగ్ధను ఎలాగైనా మీరే కాపాడాలి "
"నా ప్రాణాన్ని నేను కాపాడుకోలేనా ?
ఆ ఒకే ఒక మాట పూర్ణిమకు అమృతప్రాయమైంది..ముగ్ధ కార్తికేయను ఎందుకింత గాడం గా ప్రేమిస్తుందో అర్ధమైంది. ఆర్ద్రమైంది.
                            *******************************

కార్తికేయకు ఇప్పుడు రిలాక్స్ గా వుంది.పూర్ణిమ తో మాట్లాడక కొద్దిగా కుదుటపడ్డాడు.ముగ్ధ నాన్న గారి గురించి ఆందోళన తగ్గింది.అప్పుడే సెల్ రింగ్ అయింది....ఆన్ బటన్ నొక్కి హలో..అన్నాడు...
"నేను..ముగ్ధను.."
ఒక్కసారిగా  ఎలర్ట్ అయ్యాడు...
ముగ్ధ గొంతులో కంగారు...వెనుక రైల్వే అనౌన్స్ మెంట్...రైళ్ళ శబ్దాలు..

No comments: