ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 14 March 2013

1) బాధపడితేనే బోధపడుతుంది..గెలుపు మార్గంలో ఓటమి తరువాతే గెలుపుకై కసి పెరుగుతుంది. పోటీ తత్వం అలవడితే పరుగెట్టే ప్రపంచంతో పోరాడగల్గుతాము, గెలవగల్గుతాము.

2) జీవనయానంలో జైత్రయాత్ర సాగించాలంటే ప్రణాళికతో లక్ష్యం వైపు సాగాలి. సర్వుల బల బలాలను బేరీజు వేసుకోవాలి. దేనిని తక్కువ అంచనావేయకూడదు. అలాగే అలక్ష్యం నిర్లక్ష్యం కూడదు.

3) జ్ఞ్యాపకాలు ఊసుల ఊయలలో అస్తమాను ఊరేగితే సమకాలీన సత్యాల నుంచి నీవు దూరమవుతావు. కలచే జ్ఞ్యాపకాల నుంచి వీలైనంత తొందరగా బయటపడాలి. ప్రపంచంలో బాధలనేవి నీకోక్కిడికే లేవని తెలుసుకో.

No comments: