ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 14 March 2013

1) చిత్తశాంతి లేక చిద్విలాసుని నామాలు వేనవేలు వల్లిస్తే మాత్రం లాభామేమిటి. అత్మవలోకనం చేయక ఆత్మజ్ఞ్యానం ఎరుగక, అందరివాడు అందనివాడు ఆ దేవదేవుడు, అందుతాడా.

2) పొలంలో పంటకై విత్తు వేసి ఊరుకుంటే పంట వస్తుందా..అట్టాగే ప్లాన్ గీసుకుని కూర్చుంటే భవనం కట్టబడుతుందా..లక్ష్యంపై గురిపెట్టి అవసరమైన క్రియలు నెరపక లక్ష్యం ప్రాప్తిస్తుందా.

3) కలిమి లేములు సిరి సంపదలు చీకటి వెలుగులు పాప పుణ్యాలు కష్ట సుఖాలు ద్వంద పదాలే కాదు అర్ధవంతమైన లోతైన పదాలే. వీటిలో ఒకటి ఎరుగక రెండో దాని అర్ధం తాత్పర్యం సరిగ్గా తెలియటం కల్ల.

No comments: