ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 14 March 2013

1) ప్రత్యూష కిరణాలు వద్దన్నా నిన్ను నిద్ర లేపక మానవు. పవన సమీరాలు కూడదన్న నిను పలకరించక మానవు. నిశి తిమిరాలు నీవు కోరకున్న నీకు చీకటిరూపం చూపకుండ వుండవు. కానీ యివన్నీ నిత్యం ఒక్కలాగానే ఎల్లప్పుడు వుండవు. నీ జీవనంలో అట్లాగే కష్టాలు, బాధలు, ఇబ్బందులు వలదనుకున్న వదలవు, అలాగని ఎల్లప్పుడూ వుండవు. ప్రకృతిలో స్థితి గతుల్లోని మార్పు అనివార్యం మరియు పూజ్యం.

2) స్వలాభరహితంగా సమాజ హితంకై పాటుపడేవాడు విమర్శల పోటుకు వెరవకూడదు.మంచిమాట చెబితే ముందు ముందున పాటించేవాళ్ళ కంటే ఖండించేవాళ్ళు ముందుంటారు. అలాగే చెప్పిన మంచి మాట వెనుక చెప్పిన వారి స్వలాభాల మూలాలు లేనివి కూడా వున్నట్టు ఊహించుకుని వాటిని వెతుకుతారు. వీరి మాటల చేష్టలకు క్రుంగవద్దు. ఒకమారు అట్టివారి అనుమానం పటాపంచలవుతే వారే
నీ మాటను మూల మూలకు చేరవేస్తారు.

No comments: