ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 14 March 2013

1) ఈ ప్రపంచంలో ఆశావాదులుంటారు, నిరాశావాదులుంటారు. ఈ రెండింటి మధ్య నున్న తేడాను తెలుసుకోవడంలోనే జనులు తమ సగంపైగా జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారు. ఏదైనా విషయంపై తర్కించే తీరులోనే నీ ఆలోచన ధోరణి తేటతెల్లమవుతుంది. కావున సరైన ఆలోచన ధోరణి అలవర్చుకుంటే నిరాశ నిస్పృహలు దరిచేరవు.
2) జీవనపు పరుగు పందెంలో ముందుండడం ఎంత ముఖ్యమో దానికన్నా ముందుచూపు కలిగివుండడం మరింత అవసరం. ముందుచూపుతో ఈ జీవన పరుగు పందేన్ని గెలవడానికి కావాల్సిన సాధన, పనిముట్లు అలవర్చుకుంటే మరిక గెలుపు నీదే అవుతుంది అలాగే అందరికన్నా ముందు నిలుస్తావు. మరి ముందుచూపు వుండాలంటే..విజ్ఞ్యానాభిలాష, జిజ్ఞ్యాశ, నెమ్మదైన చిత్తము, స్పష్టమైన ఆలోచన తీరు, విషయ గ్రహణ యిత్యాదివి పెంపొందించుకోవాలి.

No comments: