ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 14 March 2013

1) నవ్వుల నజరానాలు తీయని పలుకుల తాయిలాలు పంచుకుంటే పొతే ప్రపంచంలో ఎదురు ఉండునా...ఓటమి వారి గడప తొక్కునా.
2) పరువాల వాకిళ్ళలో వలపు సరాగాలు షరా మామూలే..కానీ ఈ వయసులోనే బాధ్యతల బంధనాలు తెలిసి మెలిగితే పరిణితి చెందినట్టే.
3) నడిస్తే దూరాలు, చెప్పులు అరుగుతాయేమో గాని ఆరోగ్యం తప్పక మెరుగవుతుంది. నోరారా పిలిచి ప్రేమగా మాట్లాడితే రాయిలాంటి మనసూ స్పందిస్తుంది.

No comments: