ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 14 March 2013

1) జీవన పంధాలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించే క్రమంలో సంయమనం కోల్పోరాదు. ఓపిక నశిస్తే కళ్ళ ముందు వుండే బంగారు అవకాశాలు మృగ్యమవుతాయి.

2) చెరువులో వుండే చేపపిల్లలకు ఈత నేర్పాలా..నెమలికి నాట్యం నేర్పాలా..జింకలకు పరుగు నేర్పాలా.. స్వతఃసిద్దాంగా ప్రకృతి వొనర్చే విద్యలకు మారు వుంటుందా..

3) పల్లకిలో ఊరేగేస్తే పెద్దమనుషులంటామా, పల్లకి మోసేవారు కానివారువుతారా..సలిపే కర్మల నిజాయితినే నీయొక్క గౌరవాన్ని సముచితమా కాదా అనేది నిర్ణయిస్తుంది.

No comments: