ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 14 March 2013

1) బ్రతుకు కదనరంగంలో విజ్ఞ్యానమనే గుర్రమెక్కి సహనమనే కవచం ధరించి మృదు మందహాసభాషివై సాగితే, సర్వత్రా సర్వదా జయమే కలుగు.

2) నేర్చిన విద్యను ఆవశ్యకత ఏర్పడినపుడు ఉపయోగించకపోతే నేర్చిన విద్యకు, నేర్పిన గురువుకు అవమానం చేసినట్టే. అటువంటి స్థితిలో అజ్ఞ్యానిగా మిగిలివుంటే మేలు.

3) నెమ్మదిగా మాట్లాడువాడు..చేతకానివాడు కాదు. గట్టిగా వాదులాడువాడు..విజ్ఞ్యాని కాదు. జ్ఞ్యాన విషయం సవివరముగా తెలియక తొందరపడి నిర్ణయాలు చేయరాదు.

No comments: