1) పని పూర్తిచేసే క్రమంలో రోజంతా పరుగు
తీస్తూనే వుంటే మనసుకు నెమ్మది ఎక్కడ దొరుకు. ప్రణాళికగా సాగితే పనిలో
ప్రయాణపు బడలిక వుండదు. ఉత్సాహంగా ఉరకలేస్తూ రోజంతా నిబద్దతతో సాగవచ్చు.
2) ఇష్టం కాని పనిని నిర్దేశించబడి, నిర్దేశించిన పనిని జరప
తలపెట్టినప్పుడు ఒకోసారి మది సాగిలపడుతుంది. అందుకే తప్పనప్పుడు,
మరటువంటప్పుడు అదే పని చేయవలసినపుడు సదరు పనిని నవ్వుతో చేస్తే, చేసిన పని
కూడా నవ్వుతుంది, పని చేయించుకున్నవాళ్ళు కూడా తృప్తి చెందుతారు.
No comments:
Post a Comment