1) చిన్న చిన్న జాగ్రత్తలే ఓటమికి విజయానికి తేడా తెలిపేది.హోరు గాలిలో కొవ్వొత్తి
దీపం నిలవదు. కానీ జాగ్రత్త తీసుకుని కొవ్వొత్తి చుట్టూ రక్షణ ఏర్పాటు
చేసి గాలి చొరబడకుండ చూస్తే ఆ దీపం ఆరకుండా వెలుగునిస్తుంది.
2)
పరువు ప్రతిష్టల బొంతపై పరుండిన ఆనందం అప్రతిష్ట పరుపులపై పడి దొర్లినా
లభించునా? పరుల మంచికై తాపత్రయపడే తత్వం అలవర్చుకుంటే మనసైన మనిషిగా
వెలుగుతావు.
3) సమాజంలో మరియు యాత్రలో తోడూ లేకుండా మనగలగడం చాల
కష్టం.కోరి వచ్చేవారు కొందరైతే, కూరిమితో వచ్చేవారు ఇంకొందరు. కలిమి చూసి
వచ్చేవారిని దూరం పెట్టాల్సిందే లేకపోతే నీకు నీవే దూరమైపోతావు.
No comments:
Post a Comment