1) ఎదుటివారి మనసుని తెలుసుకుని మసులుకో. ఎదుటివారి మనసుని తెలుసుకోకపోయిన ఫర్లేదు గాని దానిని గాయపర్చే హక్కు మరొకరికి లేదు.
మేను గాయపడితే మందు పూత పూసి గాయాన్ని మాన్పగలం గాని మనసు గాయపడితే దానికి మందు లేదుగా.
2) తెలివి యుంటే చేవ యుంటే నీ చైతన్యాన్ని ఋజుమార్గంలో పెట్టి పదుగురికి దిక్సూచిగా నిలువు, నీ ప్రయోజకత్వం వెల్లడవ్వే.
ఊరికే శుష్క వ్యాఖ్యానాలతో అహంకారపూరిత ఆవేశముతో నీ చైతన్యాన్ని వక్రమార్గంలో పెట్టి ప్రజ్ఞ్యకు పరిహాసం రానివ్వకు.
3) పరుగుపందెంలో ఎంత బాగా పరిగెత్తినా మొదట నిలచిన వాడే గెలిచినట్టు. మొదట
నిలవక ఓడిపోయినా గెలిచిన వాడిని ఊరికే ఆడిపోసుకునే బదులు నీ గెలుపుకై
పరిశ్రమించు మరో ప్రయత్నంలో విజయం పొందగలవు. విజయుడిని విమర్శించినంత
మాత్రాన విజయం వరించదు.
No comments:
Post a Comment