"ముగ్ధమోహనం" (35th chapter)
(01-03-2013)
(సవరణ...నిన్నటి సంచికలో సర్జన్ రాధారాణి పేరు రాణి సంధ్య గా పడింది....గమనించగలరు.ఈ పొరపాటును మా దృష్టికి తెచ్చిన ప్రతిమ,నరేంద్ర,మనస్విని (మలేసియా ), కిరణ్మయి , కీర్తన, సారథి తదితరులకు కృతఙ్ఞతలు.---చీఫ్ ఎడిటర్ )
.........................
ఎవరి ప్రపంచం వారిది...ఎవరి సమస్యలు వారివి...రాత్రి పదకొండు దాటినా తగ్గని జనసంచారం. రోడ్డు మీద వెళ్ళే వారిని కదిలిస్తే ఎన్నెన్ని కథలో...
నేరాలు ఊపిరి పోసుకునే రాత్రి, కష్టాన్ని మర్చి అలిసి, నిద్రపోయే రాత్రి....దొంగలకు సరైన సమయం...నేరసామ్రాజ్యానికి సూర్యోదయం....
అదో స్లమ్ ఏరియా...చిన్న చిన్న గుడిసెలు...తల వంచి వెళ్ళాల్సిందే. అక్కడక్కడ విసిరేసినట్టు వుండే ఇళ్లు.
సిటికి దూరంగా వున్న ఏరియా. అరగంట నుంచి అక్కడ కాపు కాసింది సంద్యారాణి. గాలికి చున్నీ ఎగిరి ఆమె అందమైన మొహాన్ని టచ్ చేస్తూ అల్లరి చేస్తోంది. కళ్ళు అలిసినట్టు వున్నాయి. ఆ రాత్రి అక్కడ డ్రగ్స్ చేతులు మారుతున్నట్టు సమాచారం వచ్చింది.
సినిమా వార్తల, ఉమెన్స్ పేజీలోని ఏ కాలమో రాసినా సరిపోతుంది...కానీ జర్నలిజం ఆమె దృష్టిలో ఒక నిర్విఘ్న యజ్ఞం .
జీవితం అంటే కొందరికి నడిచే రైలు...మనం ఒక్కో మజిలీ దాటి వెళ్తుంటాం. కానీ మనమెక్కే రైలు ఏ గమ్యానికి చేరుతుందో తెలుసుకుని ఆ రైలు ఎక్కితే ఎన్నో లక్ష్యాల స్టేషన్లు దాటుతూ వెళ్ళవచ్చు. నెలకు కొంత జీతం.. భర్త, పిల్లలు, ఇంటికి రాగానే కాసేపు టీవీలో వార్తలు చూసి, మరి కాసేపు నిట్టూర్చి. ఆ పైన వంట డిన్నర్. పడక...ఇదీ నిత్యకృత్యం....
మనం నిద్రపోయే రాత్రి ఎన్ని సంఘటనలు జరుగుతాయి. కానీ మనం వాటిని పట్టించుకోం...పొద్దున్నే పేపర్ చదివి ప్రపంచాన్ని తెలుసుకుంటాం. కొందరు మొదటి పేజీ, మరి కొందరు సినిమా పేజీ, వంటలు,వార్పులు...నిట్టూర్పులు...సమాజాన్ని నిప్పుతో కడగమని చెప్పినా, నిగ్గదీసినా నిస్తేజమైన ప్రజలు అంతా క్షమించేస్తారు. గాడ్సేని కూడా క్షమించే ఉదార హృదయం మనది...భయంతో,నిర్లిప్తతతో, నిస్సహాయతతో...మనకెందుకులే...అనే తత్త్వంతో...
సంద్యారాణి తల విదిల్చింది. నిద్ర వచ్చేస్తుంది. సరిగ్గా అప్పుడే ఆ ఏరియా లో ఓ జీప్ వస్తోన్న శబ్దం.
***************************************************************************************************
క్యాబ్ స్పీడ్ గా వెళ్తోంది. కార్తికేయ తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. తను మరో గంటలో అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాలి.
ప్రెసిడెంట్ నుంచి అత్యవసర సందేశం. బేగంపేటలో హెలికాప్టర్ రెడీగా వుంది.శ్రీనివాస్ ని కలుద్దామనుకున్నడు...ఆసరా నడిపే మాలతిని ,
ఢిల్లీ వచ్చినప్పుడు తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి తన కోసం స్నేహరాగాన్ని ఆలపించిన సంగీత సామ్రాజ్ఞి లక్ష్మి పిరాట్లను కలుద్దామని అనుకున్నాడు .
ఎవరినీ కలువకుండానే వెళ్తున్నాడు...
ముఖ్యంగా తన శ్వాసని, ప్రస్తుత తన అస్తిత్వంకి అలంబనైన ముగ్దని పలకరించకుండా వెళ్తున్నాడు.
క్యాబ్ స్లమ్ ఏరియాని దాటింది. దూరంగా ఏదో గొడవ. డ్రైవర్ కారు అటువైపు పోనీ....అన్నాడు ఎలర్ట్ అవుతూ....
*******************************************************************************************************
జీప్ శబ్దం విని ఓ గుడిసె చాటుకు వెళ్ళింది సంద్యారాణి. జీప్ ఆగింది. అందులో నుంచి నిక్సన్ దిగాడు.
అతని కళ్ళు ఎర్రగా వున్నాయి. ఓ గుడిసె లోకి వెళ్ళాడు. సంద్యారాణి బటన్ కెమెరా సరి చేసుకుంది...
మెల్లిగా ఆ గుడిసె వైపు వెళ్ళింది. గుడిసెలోకి తొంగి చూసింది. లోపల ఎవరూ లేరు. ఒక్క క్షణం షాక్ అయింది.
ఆమె సిక్స్త్ సెన్స్ ఏదో హెచ్చరిస్తుంది. ఆమె వెనుక అలికిడి...తిరిగి చూస్తే నిక్సన్.
"వాహ్...అందమైన ఆడపిల్ల..అర్ధరాత్రి...గ్రేట్...ఆ రోజు మీటింగ్ లో వచ్చినప్పుడే సి సి కెమెరాలో గమనించాను...
హెరాయిన్..కిక్కిస్తే...ఈ విమెన్ మత్తెక్కిస్తుంది.." సంద్యారాణి చేయి పట్టుకున్నాడు.
మెరుపు వేగంతో కదిలింది. ఆమె కుడి చేయి పిడికిలిగా మారి అతని దవడని తాకింది. ఊహించని పరిణామం ...
వెంటనే ఎలర్ట్ అయి తన వెహికల్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే నిక్సన్ ఆమెను సమీపించాడు. అతని జేబులో నుంచి రివాల్వర్ బయటకు వచ్చింది. ఆమెకు గురి పెట్టాడు...అతని వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకుంది...అపుడే అతని వీపుకు రివాల్వర్ మొన తగిలింది.
నిక్సన్ తల వెనక్కి తిప్పబోయాడు.అ ప్పటికే నిక్సన్ చేతిలోని రివాల్వర్ లాక్కున్నాడు కార్తికేయ,
దూరంగా జరుగుతున్న గొడవ చూసి ప్రమాదాన్ని ఊహించాడు. అయితే ఆ చీకట్లో అతను నిక్సన్ ని గుర్తించలేదు.
నిక్సన్ పరిస్థితి ని అంచనా వేసాడు. గొడవకు ఇది సమయం కాదు...ఆ ఆలోచన రావడం తోనే కిందికి వంగి మట్టి గుప్పిట్లోకి తీసుకుని కార్తికేయ కళ్ళలో చల్లాడు. ఆ క్షణంలోనే అతడి నుంచి విడిపించుకుని జీప్ దగ్గరికి వెళ్ళాడు.. జీప్ స్టార్ట్ చేసాడు..ఇదంతా క్షణాల్లో జరిగింది.
*********************************************************************************************************
"థాంక్యూ సర్" మనస్ఫూర్తిగా అంది సంద్యారాణి.
ప్రతిగా చిన్న నవ్వు నవ్వి "మీ కమిట్ మెంట్ గొప్పదే...కానీ ప్రమాదాలను నిర్లక్ష్యం చేయరాదు." చెప్పాడు కార్తికేయ .
"యస్ సర్...ఇక ముందు జాగ్రత్తగా వుంటాను..ఎప్పుడూ మీరు రారుగా" చిన్నగా నవ్వి అంది సంద్యారాణి.
అప్పటికే బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి పైలట్ ఫోన్ కాల్...హడావుడి..
అలా కాక సమయం వుండి వుంటే కార్తికేయ ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం కానీ ప్రెసిడెంట్ ని కలవడం కానీ అవసరపడి వుండేది కాదు.
కార్తికేయ క్యాబ్ ఎయిర్ పోర్ట్ వైపు వెళ్తోంది.

మోహన రాధారాణి వైపు చూసి "మీరి సింపుల్ గా, అందంగా వున్నారు...మీ గురించి లాస్ట్ ఇయర్ అనుకుంటా...ఓ మెడికల్ జర్నల్ లో చదివాను...ప్రపంచం గర్వించదగ్గ సర్జన్ కదా..." అంది.
"ఇది చెప్పడానికి నన్ను కిడ్నాప్ చేసారా? సూటిగా అడిగింది రాధారాణి.
"గ్రేట్...మీరు కిడ్నాప్ అయ్యారని తెలిసినా భయపడడం లేదు.." మోహన అంది.
"చెప్పండి...నేను ప్లాస్టిక్ సర్జరీ ఎవరికీ చేయాలి? అడిగింది రాధారాణి.
షాక్ అయింది మోహన...

హెలికాప్టర్ ఢిల్లీ వైపు వెళ్తోంది.
కార్తికేయ ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి...తను ప్రెసిడెంట్ అఫ్ ఇండియాను డీకొన్న రోజు...
అసలా రోజు ఏం జరిగింది?
(రేపటి సంచికలో)

No comments:
Post a Comment